దేశమంతా ఒకటే ఎంట్రన్స్‌ | One entrance to the all over country | Sakshi
Sakshi News home page

దేశమంతా ఒకటే ఎంట్రన్స్‌

Published Sat, Mar 18 2017 5:06 AM | Last Updated on Fri, Aug 17 2018 6:05 PM

దేశమంతా ఒకటే ఎంట్రన్స్‌ - Sakshi

దేశమంతా ఒకటే ఎంట్రన్స్‌

ఇంజనీరింగ్‌ ప్రవేశాలపై ఏఐసీటీఈ చైర్మన్‌ సహస్రబుద్ధే

వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం
ఒక్కో విద్యార్థి పది ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయాల్సిన పనిలేదు
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘ఏకీకృత ఫీజు’ సాధ్యం కాదు
విద్యార్థులకు ‘స్వయం’ ఉపయోగపడుతుంది
‘సాక్షి’తో సహస్రబుద్ధే ప్రత్యేక ఇంటర్వూ్య


సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఇంజనీరింగ్‌ విద్యలో ప్రవేశానికి దేశమంతా వచ్చే ఏడాది నుంచి ఒకే ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించనున్నా మని, రెండు మూడు విడతల్లో ఆ పరీక్ష నిర్వహిస్తామని ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యు కేషన్‌(ఏఐసీటీఈ) చైర్మన్‌ అనిల్‌ దత్తాత్రేయ సహస్రబుద్ధే చెప్పారు. దేశమంతా ఒకేరకమైన ఫీజు విధానం సాధ్యం కాదన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలల్లో నాణ్యత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కాలేజీలకు అనుమతి ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరి స్తున్నామని తెలిపారు. అధ్యాపకులకు శిక్షణ ఇస్తామని, శిక్షణ పూర్తిచేసిన వారే కాలేజీల్లో టీచింగ్‌ చేయాలనే నిబంధన తెస్తామని వెల్లడిం చారు. కాగా, దాదాపు 3 దశాబ్దాల పాటు ఐఐటీ లో బోధించిన అనుభవం సహస్రబుద్ధే సొంతం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నిర్వహించిన ‘సృజన’ కార్యక్రమంలో పాల్గొన డానికి శుక్రవారం విజయవాడ వచ్చిన ఆయన.. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వూ్య ఇచ్చారు.

ప్రశ్న: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్‌ పరీక్ష ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఒకే ఎంట్రన్స్‌ వల్ల ప్రయోజనం ఏమిటి?
సమాధానం: వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నాం. ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్‌ విద్యలో ప్రవేశానికి చాలా పరీక్షలు నిర్వహిస్తు న్నారు. మంచి ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రవేశం పొందడానికి ఒక్కో విద్యార్థి 5 పరీక్షలు రాయా ల్సి ఉంటుంది. అన్ని పరీక్షలకు ఫీజులు చెల్లిం చాలి. ఇకపై ఒకే పరీక్ష నిర్వహిస్తాం. రెండు మూడు విడతల్లో ఈ పరీక్ష నిర్వహిస్తాం. ఏ విడతలోనైనా విద్యార్థి పరీక్ష రాయవచ్చు.

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికీ ఈ పరీక్షే ఉంటుందా?
స: తొలి దశ పరీక్షగా ఇదే ఉంటుంది. కావాలనుకుంటే.. ఐఐటీ, ఎన్‌ఐటీలు అడ్వాన్స్‌ పరీక్ష నిర్వహించుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ (+2) సిలబస్‌ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. మరి ఉమ్మడి పరీక్ష వల్ల ఇబ్బందులు ఉండవా?
స: కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించాలి. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఇప్పటికే ఉమ్మడి పరీక్ష ఉంది. ప్రతిపాదిత ఉమ్మడి ప్రవేశ పరీక్షతో కొత్తగా ఇబ్బందేమీ ఉండదు. రాష్ట్రాలకు సంబంధించినంత వరకు.. పరీక్ష ఉమ్మడి ఉన్నా, పోటీ మాత్రం ఆ రాష్ట్ర విద్యా ర్థుల మధ్యే ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు కనీస స్థాయిలోనే ఉంటాయి. సీబీఎస్సీ సిలబస్‌కు అనుగుణంగా రాష్ట్రాలు కూడా తమ సిలబస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.  

ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారుగా! ఫీజులూ ఒకేలా ఉంటాయా? ఏకీకృత ఫీజు విధానం సాధ్యమవుతుందా?
స: ఒకే రకమైన ఫీజు విధానం సాధ్యం కాదు. కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఫీజు ఉండాలి. ఉన్నత ప్రమాణాలు ఉన్న కాలేజీల్లో ఫీజు కాస్త ఎక్కువ ఉంటుంది. మిగతా కాలేజీల్లో తక్కువ ఉంటుంది.

ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఇంజనీరింగ్‌  కాలేజీల్లో ప్రమా ణాలు లేవు. పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసే నైపుణ్యం లేకపోవడమే ప్రధాన సమస్యని పరిశ్రమల వర్గాలు అంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏఐసీటీఈ ఏమైనా చేస్తుందా?
సమాధానం: దురదృష్టవశాత్తూ.. డిమాండ్‌ కంటే ఎక్కువ సంఖ్యలో కాలేజీలు ఏర్పాటయ్యాయి. కాలేజీలకు అనుమతి ఇచ్చే విషయంలో ఏఐసీటీఈ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రమాణాలు పాటించలేని, అడ్మిషన్లు తక్కువగా ఉన్న కాలేజీలను మూసేయమని మేం సూచిస్తున్నాం.

నాణ్యమైన బోధనా సిబ్బంది లేకపోవడం అసలు సమస్యకు కారణం. దీన్ని అధిగమించేందుకు ఏఐసీటీఈ చేపడుతున్న చర్యలేమిటి?
స: రెండు చర్యలు చేపడుతున్నాం.
1. ఎంటెక్‌ పూర్తి చేసి, టీచింగ్‌ రంగంలోకి రావాలనుకునేవారికి 2–3 నెలల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఈ శిక్షణకు హాజరై, పరీక్ష ఉత్తీర్ణులైతేనే టీచింగ్‌లోకి వెళ్లాలని నిబంధన తీసుకురానున్నాం.
2. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ శిక్షణ పూర్తి చేయకుంటే టీచింగ్‌ రంగంలో కొనసాగడానికి వీలు కాని విధంగా నిబంధనలు రూపొందిం చనున్నాం. వారం క్రితం సమావేశంలో ఈ సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నాం.

సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుబాటులోకి తీసుకురావచ్చు కదా?
స: ‘స్వయం’ అలాంటిదే. ప్రముఖ ప్రొఫెసర్లు, ఆయా రంగాల్లో నిపుణుల పాఠాలను ‘స్వయం’ ద్వారా విద్యార్థులు నేరుగా వినవచ్చు. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. గ్రామీణ విద్యార్థులకు ‘స్వయం’ ఎంతో ఉపయోపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలు ‘స్వయం’ ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

‘ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం’(సీబీసీఎస్‌) కేవలం కాగితాలకే పరిమితం. పూర్తిస్థాయిలో అమలుకు ఏం చేయాలి?
స: ఐఐటీల్లో అనుసరిస్తున్న సీబీసీఎస్‌ విధానం సాధారణ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అమలు చేయడం కష్టమే. కొత్త విధానానికి అలవాటుపడటానికి టైం పడుతుంది. నాణ్యత ప్రమాణాలు పెరిగితే ‘సీబీసీఎస్‌’ స్ఫూర్తి అమలు సాధ్యమవుతుంది. అందుకు తగిన శిక్షణ అధ్యాపకులకు ఇవ్వాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement