
పోరుట ఫలితమే తెలంగాణ
పోరుట ఫలితమే తెలంగాణ
60 ఏళ్లకు లభించిన విముక్తవేదనను తీర్చింది మాతృమూర్తులే ఉద్యమ చరిత్రలో బోధన్ దీక్షలకు స్థానం టీజేఏసీ అధికార ప్రతినిధి
అద్దంకి దయాకర జుక్కల్‌లో మిన్నంటిన సంబురాల ఢిల్లీ నుంచి వచ్చిన సింధేకు ఘనస్వాగతం లింబాద్రి గుట్టపై బీజేపీ విజయోత్సవం సుష్మా చలవేనన్న అల్జాపూర్ శ్రీనివాస్.
ఇందూరు ఆదివారమూ ఆడిపాడింది. తెలంగాణ విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ఊరూవాడా ఏకమై చిందేసింది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, జుక్కల్ తదితర ప్రాంతాలలో విజయోత్సవాలు సాగాయి. బోధన్‌లో 1,519 రోజుల పాటు కొనసాగిన దీక్షలు ముగిశాయి. ఢిల్లీ నుంచి జుక్కల్‌కు చేరుకున్న ఎమ్మెల్యే హన్మంతు సింధేకు కార్యకర్తలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. భీమ్‌గల్ మండలం లింబద్రిగుట్టలో బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. జిల్లా అంతటా జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి.