
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్‌లో మెరిట్‌లో ఉండి సంబంధిత జాబితాలో పేరు చేరని అభ్యర్థులు తగిన సమాచారంతో తమకు వివరాలు సమర్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు వెబ్‌సైట్లో ప్రకటన పొందుపరిచింది. అటువంటి అభ్యర్థులు తమ సమాచారాన్ని, కారణాలను వివరిస్తూ హాల్‌టిక్కెట్ నంబర్‌తో సహా తమకు ఈ–మెయిల్ ద్వారా విన్నవించుకోవచ్చని సూచించింది. అనర్హులైన వారు, డీబార్ అయిన వారు మినహా తక్కిన వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. తమ వివరాలను appsc.applications@aptonline.in కు పంపాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment