ఈసారైనా స్పందిస్తారా..?
విజయనగరం మున్సిపాలిటీ:జిల్లాలో క్రీడాభివృద్ధికి సువర్ణవకాశం లభించిం ది. మండలాల్లో ఇండోర్, ఔట్ డోర్ క్రీడా మైదానాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒక్కొక్క మండలానికి రూ.1.60 కోట్ల నిధులు మంజూరు చేయ నుంది. అయితే మైదానాల ఏర్పాటు కు అవసరమైన స్థల సేకరణపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం క్రీడా మైదానాలు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మే రకు జిల్లాలోని 34 మండలాల్లో ఒక ఇండోర్ మైదానంతో పాటు ఔట్ డోర్ క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గత నెలలోనే జిల్లా క్రీడాభివృద్ధి అధికారికి జారీ చేసింది. గతంలో ఉన్న పైకా పథకానికి పేరు మార్చి రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ పథకం కింద మైదానాల ఏర్పాటుకు ఒక్కొక్క మండలానికి రూ.1.60 కోట్లు మంజూరు చేస్తా మని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నిధుల్లో 50 శాతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద, మిగిలిన 50 శాతం నిధులు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేయనుంది. అంతేకాకుండా మైదానాల ఏర్పాటు పూర్తయిన తరువత అందులో క్రీడా సామగ్రి ఏర్పాటు చేసేందుకు రూ.15 లక్షల మంజూరు చేయనుంది. మైదానాల ఏర్పాటుకు మండలంలో ఆరు నుంచి ఏడు ఎకరాల స్థలం సేకరించాలని అధికారులకు సూచించింది. అయితే స్థల సేకరణపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక క్రీడా మైదానం నిర్మించేందుకు రూ.2.10 కోట్లు మంజూరు చేయగా జిల్లాలోని 34 మండ లాల్లో గుమ్మలక్ష్మీపురం మినహా మిగిలిన 33 మండలాల్లో స్థలాలు లేవంటూ తహశీల్ధార్లు నివేదిక పంపించారు.
అప్పట్లో నియోజక వర్గం మొత్తంలో 5.25 ఎకరాలు లేవని తేల్చి చెప్పిన తహశీల్లార్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రెండు మైదానాల ఏర్పాటుకు 6 నుంచి 7 ఎకరాల కావాల్సి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అరుుతే ఈ విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే ఈ ప్రక్రియ సులువుగా పూర్తవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయమై డీఎస్‌డీఓ కె. మనోహర్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మైదానాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల అనంతరం స్థల సేకరణ కోసం ఆర్‌డీఓల ద్వారా తహశీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు.