పలాస ఎమ్మెల్యేకు పరాభవం | pala MLA faces ambaressment in chandrababu naidu tour at srikakulam | Sakshi
Sakshi News home page

పలాస ఎమ్మెల్యేకు పరాభవం

Published Wed, Feb 11 2015 1:18 PM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

పలాస ఎమ్మెల్యేకు పరాభవం - Sakshi

పలాస ఎమ్మెల్యేకు పరాభవం

శ్రీకాకుళం : పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్సుందర్ శివాజీకి చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆయన బుధవారం హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. సీఎంను కలిసేందుకు వచ్చిన శివాజీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేదని నిరాకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో మనస్తాపం చెందిన శివాజీ అలిగి వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇది రెండోసారి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement