నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను గురువారం నగరంలోని జెడ్పీ కార్యాలయంలో సీఈఓ, ఇన్‌చార్జ్ డీపీఓ మారిశెట్టి జితేంద్ర విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న 86 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు.
ముందుగా కలెక్టర్ బంగళాకు సీఈఓ వెళ్లి ఫలితాల సీడీని కలెక్టర్ శ్రీకాంత్‌తో ఆవిష్కరింపజేశారు. జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉండటంతో ఫలితాలను ఇప్పుడు వెల్లడిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 16,190 మంది పరీక్షలు రాశారన్నారు. పరీక్ష పత్రాలను సరిగా భర్తీ చేయకపోవడం, ఇతరత్రా కారణాలతో 844 మంది పరీక్ష పేపర్లను తిరస్కరించామన్నారు.
మిగిలిన 15,346 మందికి మెరిట్ ప్రకారం వరుస క్రమంలో ర్యాంకులు ఇచ్చామన్నారు. ఖాళీగా ఉన్న 86 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తా మన్నారు. మొదటి 200లోపు ర్యాంకర్లను మాత్రమే తీసుకుని వచ్చే నెల 2 నుంచి సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు. ఆ రోజు జెడ్పీ కార్యాలయానికి ఒరిజనల్ సర్టిఫికెట్లతో రావాలని ఆయన కోరారు. ఫలితాల వివరాలకు ఠీఠీఠీ.టఞటౌ్ఛట్ఛ.ఛిౌఝ అనే వెబ్‌సైట్‌లో చూసుకోవాలని తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో పంచాయతీ కార్యదర్శుల పోస్టులన్నీ దాదాపుగా భర్తీ అవుతాయన్నారు. పని భారం తగ్గుతుందన్నారు.
మొదటి ర్యాంకర్ రామ్మోహన్
రాపూరు మండలం మల్లమ్మగుంట గ్రామంలోని తమ్మిశెట్టి రామ్మోహన్ 300 మార్కులకు గాను 260 మార్కులు సాధించి జిల్లా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు.
రెండో ర్యాంకును బాలాయపల్లి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన మావిళ్ల నాగరాజు దక్కించుకున్నారు.
మూడోర్యాంకును కొండాపురం మండలం యర్రబల్లి గ్రామానికి చెందిన దొడ్ల నాగరాజు, నాలుగో ర్యాంకును డక్కిలి మండలం కుప్పాయిపాళెం గ్రామానికి చెందిన పూలకంటి రాజేంద్రప్రసాద్, ఐదో ర్యాంకును పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంకు చెందిన గోగుల రమేష్ దక్కించుకున్నారు. రెండు నుంచి ఐదు ర్యాంకులు పొందిన వారందరూ కూడా 259 మార్కులు పొందారు. మార్కులు సమానమైనప్పటికీ ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు వీరికి ర్యాంకులు వరుసగా 2 నుంచి 5 వరకు కేటాయించారు.
నగర మహిళ సహనకే మొదటి చాన్స్
నెల్లూరు నవాబుపేటలోని ముకుందాపురం నివాసి కొండేటి సహన జనరల్‌లో 8వ ర్యాంకును దక్కించుకున్నా మహిళల విభాగంలో మొదటి ర్యాంకును పొందారు. మహిళల విభాగంలో రెండో స్థానాన్ని ఉదయగిరి మండలం బిజ్జంపల్లికి చెందిన కంచంరెడ్డి కళ్యాణి దక్కించుకున్నారు.
పంచాయతీ కార్యదర్శుల ఫలితాల వెల్లడి
Published Fri, May 30 2014 2:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement