రైతుల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడంలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన రెడ్డి తెలిపారు.
నెల్లూరు: రైతుల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడంలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన రెడ్డి తెలిపారు. ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. దొడ్డివారిన టీడీపీ నేతలను నియమించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారన్నారు.