మందకొడిగా ‘పోలవరం’ పనులు | Passively run polavaram works | Sakshi
Sakshi News home page

మందకొడిగా ‘పోలవరం’ పనులు

Published Mon, Jun 2 2014 12:30 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Passively run polavaram works

 పోలవరం రూరల్, న్యూస్‌లైన్ : పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థారుులో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు కాక వారు గ్రామాలను ఖాళీ చేయకపోవడంతో ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నారుు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మండలంలోని దేవరగొంది, మామిడిగొంది, తోటగొంది గ్రామాల్లో ట్విన్ టన్నెల్స్, పి.రెగ్యులేటర్, ఓటీ రెగ్యులేటర్, ఎఫ్ శాడిల్ డ్యామ్, ఈ శాడిల్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రధానంగా ఈ గ్రామాల నిర్వాసితులకు పూర్తిస్థాయి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేసి గ్రామాలను ఖాళీచేయిస్తే తప్పా పనులు వేగవంతం కావని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
 
 దీని కారణంగా ఇప్పటి వరకు ఈ.శాడిల్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. ట్విన్ టన్నెల్స్ తవ్వకం పనులు దాదాపు పూర్తికావచ్చారుు. మరో 30 మీటర్లు దేవరగొంది గ్రామ సమీపంలో తవ్వకం పనులు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ట్విన్ టన్నెల్స్ నిర్మాణం పనులకు సంబంధించి రూ.91 కోట్లు ఖర్చు అయినట్లు ప్రాజెక్టు డివిజన్-2 ఈఈ సయ్యద్ ఇలియా బాష తెలిపారు. టన్నెల్ లోపలి భాగంలో కాంక్రీట్ లైనింగ్ పనులకు కూడా అనుమతి వచ్చిందన్నారు. 64వ ప్యాకేజీలో భాగంగా మామిడిగొంది గ్రామం నుంచి తోటగొంది గ్రామం వరకు కుడి, ఎడమ టన్నెల్స్ 826 మీటర్లు తవ్వకం పనులు పూర్తయ్యాయి.
 
63వ ప్యాకేజీలో భాగంగా మామిడిగొంది గ్రామం నుంచి దేవరగొంది గ్రామం వరకు కుడి టన్నెల్ 757 మీటర్లు, ఎడమ టన్నెల్ 715 మీటర్లు తవ్వకం పనులు జరిగాయని, మరో 30 మీటర్లు టన్నెల్ తవ్వకం పనులు జరగాల్సి ఉందన్నారు. 64వ ప్యాకేజీ కింద మామిడిగొంది నుంచి తోటగొంది గ్రామాల మధ్య తవ్వకం పనులకు సంబంధించి రూ.73.899 కోట్లకు గానూ రూ. 51.767 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు అయిందని, అలాగే 63వ ప్యాకేజీ మామిడిగొంది గ్రామం నుంచి దేవరగొంది తవ్వకం పనులకు సంబంధించి రూ.72.81 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.39.748 కోట్లు ఖర్చు అయిందన్నారు. టన్నెల్స్ లోపలి భాగంలో లైనింగ్ పనులు పూర్తయ్యాక 90 సెంటీమీటర్లు కాంక్రీట్ పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. 62వ ప్యాకేజీలో చేపట్టిన పి.రెగ్యులేటర్, ఓటీ రెగ్యులేటర్, ఎఫ్ శాడిల్‌డ్యామ్ నిర్మాణ పనులకు సంబంధించి రూ.79 కోట్లకు గానూ రూ.61.269 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement