project works
-
బెంగళూరు–కడప–విజయవాడ.. ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రూ.14వేల కోట్లతో చేపట్టే బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా రూ.లక్ష కోట్లతో నిర్మించే 112 జాతీయ రహదారులకు కూడా ప్రధాని ఈ సందర్భంగా హర్యానాలోని గురుగామ్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 35 జాతీయ రహదారులను కూడా ఆయన ప్రారంభించారు. మొత్తం రూ.29,395 కోట్లతో 1,134 కి.మీ.మేర ఈ జాతీయ రహదారులను రాష్ట్రంలో నిర్మించారు. ఇక బెంగళూరు–కడప–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనులను 14 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయతో పాటు, ఉద్యోగావకాశాలను పెంపొందించడంలో, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ఇవి దోహదం చేయనున్నాయి. యూపీ తర్వాత ఏపీకే ఎక్కువ ప్రాజెక్టులు : మోదీ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అద్భుతమైన సహకారం అందిస్తోందని ప్రశంసల వర్షం కురిపించారు. అందుకే దేశంలో ఉత్తరప్రదేశ్ తరువాత ఏపీలోనే అత్యధికంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. విజయవాడ–బెంగళూరు ఎకనామిక్ కారిడార్‌తోపాటు అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పారిశ్రామికాభివృద్ధి కూడా సాధ్యపడుతుందన్నారు. విజయవాడ ఈస్ట్ బైపాస్, భోగాపురం ప్రాజెక్టులను త్వరగా చేపట్టండి.. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన విజయవాడ ఈస్ట్ బైపాస్, విశాఖపట్నం–భోగాపురం ఆరులేన్ల రహదారుల నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానిని కోరింది. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దిగ్బంధంలో ‘గుడాటిపల్లి’
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుడాటిపల్లికి వెళ్లే రోడ్డు, కట్ట మూసివేత పనులు శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల పహారా మధ్య ప్రారంభమయ్యాయి. దాదాపు 400మందికి పైగా పోలీసులు మోహరించారు. గుడాటిపల్లిలో నిర్వాసితులను ఆ పనుల వద్దకు రానీయకుండా పోలీసులు భారీ బందోబస్తుతో కట్టడి చేశారు. నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గ్రామస్తులు రోడ్డుపైనే దాదాపు5 గంటలకి పైగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని మహిళలను హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌కు, మిగిలిన వారిని మద్దూరు, చేర్యాల పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో పెండ్యాల సౌజన్య అనే మహిళ చేతికి గాయాలయ్యాయి. కాగా, అర్ధరాత్రి నుంచి కట్టనిర్మాణ పనులు చేపట్టడంతో తాగునీరు సరఫరా అర్ధాంతరంగా ఆగిపోయింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కట్ట నిర్మాణ పనులు రాత్రికి రాత్రే ప్రారంభించడం ఏమిటని? పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని నిర్వాసితులు దుమ్మెత్తిపోశారు. కాగా, గుడాటిపల్లి గ్రామంతో పాటు పరిధిలోని తండాలను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు. నిర్వాసితుల ఆందోళన కవరేజ్ చేసేందుకు మీడియాను సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాగా, ఇన్నేళ్లుగా కలసిమెలసి ఉన్న గుడాటిపల్లి వాసులు ఇక అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి రావడంతో కంటతడి పెట్టారు. హుస్నాబాద్, గౌరవెల్లి, నందారం క్రాస్ ఇలా పలుచోట తాత్కాలికంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో సర్పంచ్ పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం రాత్రి 9 గంటలకు గౌరవెల్లి ప్రాజెక్టు సమీపంలోని గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చు న్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని. కానీ ప్రభుత్వం ఎక్కడా ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. పరిహారం వచ్చేంత వరకు తాను ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఆయనకు తోడుగా కొందరు యువ తీయువకులు సైతం దీక్షలో కూర్చున్నారు. -
రెండో ఏడాది నుంచే ఫీల్డ్ స్టడీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్య ఈ ఏడాది నుంచి సరికొత్తగా ఉండబోతోంది. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అన్ని కాలేజీలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. విశ్వవిద్యాలయాలు సైతం ఇప్పటికే బోధన ప్రణాళిక తీరు తెన్నులను కాలేజీలకు పంపాయి. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా స్వీయ అనుభవంతో బోధన ఉండబోతోందని యూనివర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విజ్ఞానం అందిపుచ్చుకునేందుకు కృషి చేయాలని అంటున్నాయి. ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు నాలుగో సంవత్సరంలో కాకుండా ముందు నుంచే విద్యార్థులపై దృష్టి పెట్టబోతున్నాయి. వారిలో నైపుణ్యానికి పదును పెట్టే రీతిలో ప్రాజెక్టు వర్క్స్‌ను ఎంపిక చేసినట్టు కొన్ని కాలేజీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు తెలిపాయి. రెండో ఏడాది నుంచే... అన్ని బ్రాంచీల విద్యార్థులకు మొదటి సంవత్సరం పుస్తక విషయ పరిజ్ఞానం ఆధారంగానే కొనసాగుతుంది. రెండో ఏడాది నుంచి ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ నాల్గవ సంవత్సరంలో మాత్రమే ఈ ప్రక్రియ ఉండేది. అదికూడా విద్యార్థులు ఇష్టానుసారం ఏదో ఒక ప్రాజెక్టు సమర్పించేవాళ్లు. ఈ క్రమంలో విద్యార్థులు ఎవరో తయారు చేసిన ప్రాజెక్టులను కొని తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. దీనివల్ల విద్యార్థికి డిగ్రీ చేతికొచ్చినా విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండేది కాదు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు రిపోర్టులను పక్కాగా తయారు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన ప్రముఖ కంపెనీలకు సెకండియర్ విద్యార్థి వెళ్లాలి. అక్కడి నిపుణులతో మమేకమై సరికొత్త టెక్నాలజీపై ఆలోచన చేయాలి. విద్యార్థిలో విషయ పరిజ్ఞానం ఉందని, ప్రాజెక్టు రిపోర్టు సరికొత్తదేనని సంబంధిత సంస్థలు ధ్రువీకరించాలి. అప్పుడే ప్రాజెక్టు రిపోర్టును విశ్వవిద్యాలయాలు ఆమోదిస్తాయి. ఇదేవిధంగా నాల్గో సంవత్సరంలోనూ మరింత లోతైన అవగాహనతో ఆవిష్కరణ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి సంపూర్ణమైన స్వీయ పరిజ్ఞానం పొందుతాడని విశ్వవిద్యాలయాలు భావిస్తున్నాయి. కంప్యూటర్ కోర్సులపై దృష్టి రాష్ట్రంలో 90 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరగా, ఇందులో 64 శాతం కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీలకు చెందిన వారున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇంజనీరింగ్ విద్యలో కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకోవడం ఇప్పటివరకూ జరిగింది. ఇక నుంచి తొలి ఏడాదిలోనే అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న కోడింగ్ విధానంపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల అనుసంధానంతో కంప్యూటర్ కోర్సుల్లో లోతైన ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుపరిచే దిశగా ఈ ఏడాది నుంచి బోధన ప్రణాళిక ఉండబోతోందని వర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి. కోడింగ్‌పై సరైన అవగాహన ఉందనేది ప్రాజెక్టు రిపోర్టుల ద్వారా విద్యార్థి నిరూపించుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులే కీలకం ఈ ఏడాది నుంచి సెకండియర్‌లో ప్రాజెక్టు నివేదికలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనివల్ల విద్యార్థి నాణ్యమైన ఇంజనీర్‌గా బయటకొచ్చే వీలుంది. ఎంతోమంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నా, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఆ దిశగానే సరికొత్త బోధన ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూ వీసీ -
ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తేవాలనుకుంటున్న ఈ బోధనా విధానం ప్రకారం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోనే ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే మార్కులు ఇస్తారు. అలాగే ఆఖరి సంవత్సరంలో మరో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాలనే షరతు పెట్టనున్నారు. ఎందుకీ మార్పు...? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో 12 శాతం మంది మాత్రమే స్కిల్డ్ జాబ్స్ పొందుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సర్వేలో ఇది స్పష్టమైంది. కంప్యూటర్ సైన్స్‌లో కనీసం కోడింగ్ కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో వెల్లడైంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా ప్రణాళిక లేదని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల కోసం స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బోధన స్థాయిలోనూ పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని ఏఐసీటీఈ సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొంతకాలంగా సరికొత్త బోధన ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడది ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. నాణ్యమైన విద్య, తక్షణ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్నత విద్యలో మార్పులతోపాటు ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంజనీరింగ్ విద్యలో ఫీల్డ్ అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే దీని భాగస్వామ్యాన్ని పెంచనున్నాం. నవీన దృక్పథంతో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే ఇంటర్నల్ మార్కులను 20 నుంచి 40కి పెంచాం. ఎక్స్‌టర్నల్స్ 60 మార్కులకు ఉండేలా మార్పులు చేశాం. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాజెక్టు వర్క్ చేయడం, సంబంధిత సంస్థ నుంచి ధ్రువీకరణ తీసుకురావడాన్ని తప్పనిసరి చేస్తున్నాం. ఇవన్నీ ఇంజనీరింగ్ విద్య నాణ్యతను పెంచుతాయని, మార్కెట్లో మంచి నిపుణులుగా విద్యార్థులను నిలబెడతాయని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ -
పనులు పరుగులు
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా జిల్లాలో ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గండికోట–సీబీఆర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్ విస్తరణ, అలవలపాడు లిఫ్ట్ స్కీమ్, జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్, జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ పథకాలను చేపట్టింది. సుమారు రూ. 10,816 కోట్లతో పనులు చేపట్టగా గత మార్చిలో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవలే అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ పనులు మొదలయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మలు భూసేకరణ పనులను పర్యవేక్షిస్తుండగా జీఎన్ఎస్ఎస్ అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ పనులు పూర్తయితే వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 4.34 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందులో 4,04,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కాగా, మరో 30 వేల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుంది. 12 లక్షల మందికి తాగునీరు అందనుంది. మొత్తంగా రెండు జిల్లాల్లో సాగు, తాగునీటి కష్టాలు తీరినట్లే. పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు రూ. 1256 కోట్లతో పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. సీకేఎల్ఐ, పీబీసీ, సీబీఆర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుండి నీటిని పంప్ చేసి ప్రత్యేకంగా నిర్మించే సంపులు, పైపులైన్ల ద్వారా ఆయకట్టుకు మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటిని అందించనున్నారు. సంపులు, పైపులైన్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. 1,22,480 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం లక్ష్యం. అలవలపాడు లిఫ్ట్ స్కీమ్ రూ. 56 కోట్లతో అలవలపాడు లిఫ్ట్ స్కీమ్ పనులను ప్రభుత్వం చేపట్టింది. పీబీసీ పరిధిలో 50వ కిలోమీటరు తర్వాత టెయిలెండ్ పరిధిలోని 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం లక్ష్యం. జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ నుండి 1.5 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అలవలపాడు ట్యాంకు, పెండ్లూరు ట్యాంకు, పీబీసీ 50వ కిలోమీటరు చివరి ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి కావచ్చు. ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సీబీఆర్ నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించి 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది లక్ష్యం. ప్రాజెక్టుల నీరు అందించలేని కొండ ప్రాంతాలకు లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించి పైపుల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. సీబీఆర్‌కు 110 మీటర్ల పైభాగంలో (ఎత్తున) ఉన్న ప్రాంతాలలోని ఆయకట్టుకు పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సాగునీటిని అందించనున్నారు. దీంతోపాటు లింగాల మండలంలో ఎగువపల్లి, దిగువపల్లి, మురారిచింతల, అంబకంపల్లె, ఎర్రబల్లి, గిడ్డంగివారిపల్లె తదితర ఎనిమిది చెరువులను నీటితో నింపనున్నారు. గిడ్డంగివారిపల్లె చెరువులో 1.2 టీఎంసీల నీటిని నింపి యురేనియం ప్రభావిత ఏడు గ్రామాల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు అక్కడి ప్రజలకు తాగునీటిని అందించనున్నారు. ఈ లెక్కన మొత్తం 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ. 1113 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. భూ సేకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గండికోట–సీబీఆర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్ పనుల విస్తరణ గండికోట నుండి సీబీఆర్‌కు రెండు వేల క్యూసెక్కులు, పైడిపాలెంకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించాలన్నది ఉద్దేశం. పైడిపాలెం ఆరు టీఎంసీల సామర్థ్యం కాగా, సీబీఆర్ 10 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. మొత్తం 16 టీఎంసీల నీటిని ప్రస్తుతం ఉన్న సామర్థ్యం మేరకు 70 రోజుల్లో నింపాల్సి వస్తోంది. దీనిని 35 రోజులకు తగ్గించేందుకు ఈ కొత్త లిఫ్ట్ స్కీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా జీకేఎల్ఐ, సీబీఆర్, పీబీసీల పరిధిలో మొత్తం 1,63,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. ఇందులో మైక్రో ఇరిగేషన్ ద్వారా 1,22,480 ఎకరాలకు నీటిని అందించనున్నారు. రూ. 3050 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ప్రస్తుతం కొండాపురం మండల పరి«ధిలోని లావనూరు వద్ద టన్నెల్ పనులు జరుగుతున్నాయి. 2023 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ రూ. 5036 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా వైఎస్సార్ జిల్లాలోని చక్రాయపేటతోపాటు అన్నమయ్య జిల్లాలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, వీరబల్లి ప్రాంతాల్లోని 133 చెరువులను నీటితో నింపనున్నారు. వైఎస్సార్ జిల్లా పరిధిలో 91 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జీఎన్ఎస్ఎస్ 56వ కిలోమీటరు నుంచి నీటిని లిఫ్ట్ చేసి తరలించనున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లె, పీలేరులో రెండు లక్షల ఎకరాల హెచ్ఎన్ఎస్ఎస్ ఆయకట్టుకు సాగునీరు అందనుంది. వైఎస్సార్ జిల్లా పరిధిలో రెండు లక్షల మందికి, అన్నమయ్య, చిత్తూరు జిల్లా పరిధిలో 10 లక్షల మందికి మొత్తం 12 లక్షల మందికి తాగునీటిని అందించనున్నారు. దీని పరిధిలో భూ సేకరణ పనులు, భూ సేకరణ గుర్తింపు పనులు, డిజైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాయలసీమ కరువు నివారణ పనులు వేగవంతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 4,34,000 ఎకరాలకు సాగునీరు, 12 లక్షల మందికి తాగునీరు అందుతుంది. అప్ల్యాండ్ ఏరియాల్లోని భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. – మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్, కడప 8 జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ రూ. 305 కోట్లతో గండికోట జీరో కిలోమీటరు నుంచి 56వ కిలోమీటరు వరకు జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్‌ను విస్తరించడంతోపాటు లైనింగ్ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ఈ మొత్తం ఆరు ప్రాజెక్టుల పరిధిలో 2500 ఎకరాల భూమిని సేక రించాల్సి ఉండగా, భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి మంగళవారం కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, జీఎన్ఎస్ఎస్ ఎస్ఈ మల్లికార్జునరెడ్డిలు పనులను పర్యవేక్షిస్తున్నారు. -
అ‘ధనం’ ఇచ్చినా అందుకోలేదు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు ధరలు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ఇంతవరకు అవి పూర్తి కాలేదు. 16 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోని 86 ప్యాకేజీల పనులకు అదనపు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సుముఖం చూపినా ఇప్పటివరకు జరగని భూసేకరణ, సహాయ పునరావాసం (ఆర్అండ్ఆర్), బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా 61 ప్యాకేజీల పనులు ఐదేళ్లుగా పూర్తి కాలేదు. మరో 15 వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేస్తే కానీ ఈ పనులు పూర్తయి మరో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందదు. ఈ దృష్ట్యా ఈ పనుల గడువును మరో 6 నెలల నుంచి రెండేళ్లు పెంచాల ని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఐదేళ్లుగా ఎక్కడికక్కడే.. జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు వివిధ కారణాల రీత్యా జాప్యం జరగడంతో పాత ధరల ప్రకారం పనులు కొనసాగించలేమని కాంట్రాక్టు ఏజెన్సీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పెరిగిన సిమెంట్, కాంక్రీట్, స్టీలు ధరలకు అనుగుణంగా కొత్త ధరలు చెల్లించేందుకు ప్రభుత్వం 2015లో జీవో–146 వెలువరించింది. అనంతరం 2017లో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రాజెక్టుల్లో ఐబీఎం అంచనాలకు అదనంగా కొత్త కాంక్రీటు నిర్మాణాలు, అదనపు నిర్మాణాలు, లైనింగ్ పనులు చేరితే ఆ పనులకు అనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు. ఈ జీవోల మేరకు 2013 ఏప్రిల్ తర్వాత నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని ప్యాకేజీల పనులకు జీవో–146 అమలు చేస్తున్నారు. మొత్తంగా 111 ప్యాకేజీల పనులను దీని కింద చేర్చారు. తర్వాత ఇందులో కొన్నింటిని తొలగించి 86 ప్యాకేజీలకు జీవో వర్తింపచేశారు. రూ.19 వేల కోట్ల విలువైన ఈ ప్యాకేజీల పరిధిలో పనులు పూర్తి చేయాలంటే 45 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. అయితే, ఇప్పటికీ చాలా ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తి కాలేదు. ముఖ్యంగా బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజీ–2 వంటి పథకాల్లో ఇంకా భూ సేకరణ పూర్తి కాలేదు. ఇంకా 15 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ జరగాల్సి ఉంది. కొన్ని చోట్ల ఆర్అండ్ఆర్ పనులు పూర్తికాక కోర్టు కేసుల నేపథ్యంలో పనులు ముందుకు కదలడం లేదు. కొన్ని ప్యాకేజీల పరిధిలో చాలాకాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీలు పనులు చేయడం లేదు. మరికొన్ని ప్యాకేజీల్లో ఏజెన్సీలు దివాలా తీయడంతోనూ పనులు ఆగిపోయాయి. దీంతో మరో రూ.3,500 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితేనే మరో 10 లక్షల ఎకరాల మేర ఆయకట్టు వృద్ధిలోకి వస్తుంది. ఇప్పటికే ఈ ప్యాకేజీల గడువును 2007–08 నుంచి 5 నుంచి 10 సార్లకు పైగా పొడిగించగా, ఇప్పుడు మళ్లీ వీటి గడువును 6 నెలల నుంచి రెండేళ్ల వరకు పొడిగించాలని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని పక్షంలో ఆ ఏజెన్సీలు కొన్నేళ్లపాటు ఎలాంటి పనులు చేపట్టకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. -
ఐటీకి కలిసొచ్చిన ‘కరోనా’!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో కంపెనీల వ్యూహాలు గణనీయంగా మారిపోతున్నాయి. చాలా మటుకు సంస్థలు డిజిటల్ మాధ్యమం వైపు మళ్లడం లేదా ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న పక్షంలో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ స్వరూపాన్ని వేగంగా మార్చుకోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, జెన్‌ప్యాక్ట్, విప్రో, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీ భారీగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులు దక్కించుకుంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ మహమ్మారి అందరిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ సర్వీసులను, ఉత్పత్తుల విక్రయాలకు తక్షణం ఆన్లైన్ బాట పట్టాల్సిన అవసరాన్ని గుర్తించాయని విశ్లేషకులు తెలిపారు. వేగంగా వ్యూహాల అమలు.. ప్రస్తుత వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు చేర్పులు చేసే దిశగా ఇన్ఫోసిస్‌కు అమెరికాలో రెండు భారీ డీల్స్ దక్కాయి. వీటిలో ఒకటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాన్‌గార్డ్‌ది కాగా మరొకటి ఇంధన రంగ దిగ్గజం కాన్ ఎడిసన్‌ది. కరోనా సంక్షోభం కారణంగా చాలా మటుకు క్లయింట్లు డిజిటల్ వ్యూహాలను మరింత వేగంగా అమలు చేయాలనుకుంటున్నారని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ ఇటీవల తెలిపారు. భారీ స్థాయిలో డిజిటల్ రూపాంతరం చెందేందుకు వాన్గార్డ్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇలాంటి ధోరణులకు నిదర్శనమని ఆయన చెప్పారు. అయిదేళ్ల పాటు జరగాల్సిన కొన్ని ప్రాజెక్టుల కాలవ్యవధిని కొంతమంది క్లయింట్లు ఏకంగా 18 నెలలకు కుదించేసుకున్నారని జెన్‌ప్యాక్ట్ వర్గాలు వివరించాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి గత కొద్ది నెలలుగా ప్రస్తుత, కొత్త క్లయింట్లతో చర్చలు గణనీయ స్థాయిలో జరుగుతున్నాయని పేర్కొన్నాయి. వ్యయ నియంత్రణ చర్యలు.. వచ్చే రెండు నుంచి నాలుగు క్వార్టర్ల పాటు వ్యాపార సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడంపైనా, డిజిటల్‌కు మారడంపైనా దృష్టి పెడతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. తదనుగుణంగానే ఐటీ బడ్జెట్లు కూడా ఉంటాయని తెలిపారు. దీంతో ఐటీ కంపెనీలకు భారీగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్స్ దక్కుతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కారణాల కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలన్నదే వ్యాపార సంస్థల లక్ష్యంగా ఉంటోందని పేర్కొన్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా చూస్తే జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతరత్రా టెక్ సర్వీసుల కంపెనీల క్లయింట్లలో ఎక్కువగా కన్జూమర్ గూడ్స్ తదితర రంగాల సంస్థలు త్వరితగతిన డిజిటల్ వైపు మళ్లేందుకు సేవల కోసం డీల్స్ కుదుర్చుకున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు 500 మిలియన్ డాలర్ల పైచిలుకు విలువ చేసే పలు ఒప్పందాలతో దూసుకెడుతున్నాయి. ఇప్పటిదాకా డిజిటలీకరణపై తగిన స్థాయిలో ఇన్వెస్ట్ చేయని సంస్థలు ప్రస్తుతం దాని ప్రాధాన్యతను గుర్తించి, ప్రధాన ఎజెండాగా మార్చుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
జీహెచ్ఎంసీకి కలిసివచ్చిన లాక్డౌన్..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో వివిధ ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం (2019– 20)తో పాటు ప్రస్తుతకొత్త ఆర్థిక సంవత్సరం (2020–21)లోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వేగంగా జరుగుతున్నాయి. నగరంలో ఏ ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నా, ట్రాఫిక్ మళ్లించాల్సి ఉండటం, రాత్రివేళల్లో మాత్రమే పనులు జరగడం వంటి కారణాలతో ఆలస్యమయ్యేది. వీటికి తోడు భూసేకరణ సమస్యలతోనూ చాలాకాలంపెండింగ్లో ఉండేవి. జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలు వచ్చే కొత్త సంవత్సరం ఆరంభంలోజరగాల్సి ఉన్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ పనులు చేయాలని భావించిన ప్రభుత్వం గత సంవత్సరం నుంచే పనుల వేగాన్ని పెంచాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ త్వరగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. మంత్రి హెచ్చరికల నేపథ్యంలో గత ఏడెనిమిది నెలలుగా పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన పనులకు నిధుల కొరత కూడాలేకపోవడంతో పనుల వేగం పెరిగింది. భూసేకరణ సమస్యలున్న, ట్రాఫిక్ అనుమతి లభించని ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల వీలైనంత వేగంగా పనులు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందుల వల్లే చాలాచోట్ల పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అందరికీ ఇబ్బందిగా మారిన లాక్డౌన్ జీహెచ్ఎంసీ ప్రాజెక్టు పనులకు మాత్రం తగిన సదుపాయాన్నిసమకూర్చింది. ఇదే అదనుగా పనుల వేగం పెంచారు. ఐదారు నెలల్లో జరిగే పనుల్ని నెలలోనే పూర్తిచేశారు. ఏడాది కాలంగా కాని పనుల్ని సైతం నాలుగు వారాల్లో చేయగలిగారు. గత సంవత్సరం నుంచే పనుల వేగం పెరగడంతో ప్రాజెక్టŠస్ విభాగం దాదాపు రూ.450 కోట్ల విలువైన పనుల్ని గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేసింది. గత మార్చిలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో అప్పట్నుంచీ పెరిగిన వేగాన్ని కొనసాగిస్తోంది.లాక్డౌన్ లోపునే క్లిష్టమైన పనులన్నీ పూర్తిచేసేలక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే సమయం కలిసి రావడంతో ఎక్కువ పనులు చేశారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం గతసంవత్సరం కంటే రెట్టింపు పనులు జరిగేందుకు అవకాశం ఏర్పడింది. వాననీటి సమస్య పరిష్కారానికి రూ. 95 కోట్ల పనులు.. రోడ్ల వెంబడి నీరు పారే సాధారణ వరద కాలువల పనుల్ని మెయింటెనెన్స్ విభాగం నిర్వహిస్తుండగా, భారీ నాలాలు, వాటి ఆధునికీకరణ తదితర పనుల్ని ప్రాజెక్టŠస్ విభాగం నిర్వహిస్తోంది. వాననీటి ముంపు సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల్లో నాలాలను ఆధునికీకరించారు. రిటైనింగ్ వాల్స్ వంటి పనులు చేశారు. బాటిల్ నెక్స్ సమస్యలు పరిష్కరించారు. కల్వర్టు స్లాబుల నిర్మాణం వంటివి చేశారు. ఇలా 26 పనులు పూర్తి చేశారు. కైత్తాపూర్, హైటెక్ సిటీ, సున్నం చెరువు, ఆలుగడ్డ బావి జంక్షన్, పంజగుట్ట, బైరామల్‌గూడ, బండ్లగూడ, బర్లకుంట, ఖాజాగూడ, పాతబస్తీ, ఎల్బీనగర్ వివేకానందనగర్ తదితర ప్రాంతాల్లో పనులు చేశారు. వీటి వ్యయం దాదాపు రూ.95 కోట్లు. రోడ్ల కోసం రూ. 25.50 కోట్లు ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో లింక్ రోడ్లు, అప్రోచ్ మార్గాలు తదితర పనుల్ని ప్రాజెక్టŠస్ విభాగమే చేసింది. వీటిలో ముఖ్యమైనవి ఇనార్బిట్ మాల్– మాదాపూర్ మెయిన్‌రోడ్ వయా వెస్టి హోటల్, కొండాపూర్ మెయిన్‌రోడ్– జేవీ హిల్స్ వయా రాఘవేంద్ర కాలనీ, బొటానికల్ గార్డెన్– ఓల్డ్ బాంబే రోడ్డు బ్యాలెన్స్ పనులు. మియాపూర్– ఎల్లమ్మబండ లింక్‌రోడ్డు, బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర బ్రిడ్జి ఓవర్ నాలా వెడల్పు, అప్రోచ్‌రోడ్డు తదితర పనులు ఉన్నాయి. మరికొన్ని ఇలా.. వీటితోపాటు 5 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ఓబీ), 6 ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు, 14 ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, వివిధ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, స్టేడియాలకు సంబంధించిన పనులు చేశారు. వీటికైన ఖర్చు దాదాపు రూ.60కోట్లు. ఇవి కాకుండా కార్యాలయ భవనాలు, ఇతరత్రా పనులతో కలిపి మొత్తం దాదాపు రూ.450 కోట్లు పనులు చేశారు. రోడ్ల నిర్వహణ, రీకార్పెటింగ్ పనుల వంటివి నిర్వహణ విభాగం పర్యవేక్షిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రత్యేక విభాగం ఉంది. ఆ పనులు వీటికి అదనం. త్వరలోనే పూర్తయ్యేవి.. బయో డైవర్సిటీ మొదటి వరుస ఫ్లై ఓవర్‌తోపాటు దుర్గంచెరువు కేబుల్ స్ట్రేబిడ్జి పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. కామినేని జంక్షన్ వద్ద కుడివైపు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్‌పాస్, జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి తదితర పనులు కూడా త్వరలో పూర్తి కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్
-
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న సీఎం
-
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, కలెక్టర్ ముత్యాల రాజు స్వాగతం పలికారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు మార్గనిర్దేశం చేయడానికి సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టుల బాట పట్టారు. -
పడకేసిన సంయుక్త ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి సంయుక్తంగా చేపట్టాలన్న నిర్ణయం వికటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మధ్య సమన్వయం కొరవడి పనులు పడకేస్తున్నాయి. తీవ్ర విభేదాలు నెలకొని మిగతా ప్రాజెక్టులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టుల అంచనా విలువ పెరిగి ఖజానాపై భారాన్ని పెంచుతోంది. కనీసం రెండు వైపుల సమన్వయం కోసం సమావేశాలు కూడా ఏర్పాటు కావట్లేదు. సమస్యకు కారణం మీరంటే మీరని లేఖల యుద్ధం నడుస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వట్లేదంటూ రైల్వే బోర్డుకు జీఎం లేఖ రాశారు. అయితే ఈ వ్యవహారం.. ఆయా ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్లో నిధులు మంజూరు చేయటంలో పడుతుందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొత్త సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఇటీవల రైల్వే జీఎం గజానన్ మాల్యా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించారు. కానీ తర్వాత ఏ భేటీ జరగలేదు. కాగా, రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు చేపట్టలేకపోతున్నామని రైల్వే జీఎం రైల్వే బోర్డు చైర్మన్ దృష్టికి తెచి్చన నేపథ్యంలో.. బడ్జెట్ కేటాయింపులు సంతృప్తిగా ఉంటాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయగిరికి వెళ్లేనా..? ఘట్కేసర్–యాదాద్రి (రాయగిరి) ఎంఎంటీఎస్ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు పేరు వినగానే హైదరాబాద్ శివారు వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ అది ప్రకటనకే పరిమితమైంది. దీన్ని రాష్ట్రప్రభుత్వ సహకారంతో రైల్వే చేపట్టింది. మూడో వంతు నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. కానీ సమన్వయం పూర్తిగా కొరవడింది. దీనికి రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు రాకపోవటంతో ఇప్పటి వరకు రైల్వే ఆ పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్ సేవలు పరిమితంగా మారిపోయాయి. సగటున కేవలం 1.6 లక్షల మంది మాత్రమే నిత్యం ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. కానీ ఆ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని సేవలను విస్తరించేందుకు ఏడేళ్ల క్రితం రెండో దశకు శ్రీకారం చుట్టారు. కానీ పనులు ముందుకు సాగట్లేదు. ఖర్చులో మూడో వంతు నిధులు మాత్రమే భరించాల్సిన రైల్వే.. అంతకంటే ఎక్కువే ఖర్చు చేసింది. కలల ప్రాజెక్టు పరిస్థితీ అంతే.. కరీంనగర్‌ను హైదరాబాద్‌తో రైల్వే మార్గం ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు విషయంలోనూ రైల్వే–రాష్ట్రప్రభుత్వం మధ్య పేచీ నెలకొంది. ఈ ప్రాజెక్టు కోసం యావత్తు తెలంగాణ రెండు దశాబాద్దాలుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు పట్టాలెక్కిన దీన్ని పరుగుపెట్టించటంలో మాత్రం రైల్వే విఫలమవుతోంది. రూ.1,160 కోట్ల అంచనాతో ప్రారంభమైన పనులు పడకేశాయి. మనోహరాబాద్–గజ్వేల్ మధ్య 32 కి.మీ. మేర మాత్రం దాదాపు ఏడాది ఆలస్యంగా పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగతా చోట్ల భూసేకరణ వద్దే నిలిచిపోయాయి. దీనికి రాష్ట్రప్రభుత్వం మూడో వంతు నిధులివ్వాలి. భూసేకరణ ఖర్చు భరించాలి. కానీ నిధులు ఇవ్వక భారం రైల్వేపై పడుతోందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు రవాణాకు కీలకం.. బొగ్గు రవాణాకు అత్యంత కీలకం కానున్న భద్రాచలం–సత్తుపల్లి రైల్వే ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే సమస్య నెలకొంది. రూ.704 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే రెండేళ్లక్రితమే పచ్చజెండా ఊపింది. భూసేకరణ భారాన్ని రైల్వే భరించనుండగా, ప్రాజెక్టు ఖర్చును రాష్ట్రప్రభుత్వం పక్షాన సింగరేణి సంస్థ భరించాల్సి ఉంది. తమకు నిధులు అందలేదని చెబుతూ రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచబోతోంది. అసలు పనే మొదలు కాకుండా ఏకంగా రూ.200 కోట్ల మేర ఖర్చును పెంచుతూ కొత్త అంచనా వ్యయాన్ని ప్రకటించేందుకు రైల్వే సిద్ధమైంది. గత బడ్జెట్లో రూ.405 కోట్లు భూసేకరణకు కేటాయించింది. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. రాష్ట్రప్రభుత్వ పక్షాన నిధులు రానందున ఈ బడ్జెట్‌పై దాని ప్రభావం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. చివరికొచ్చాక తప్పని జాప్యం.. కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాజెక్టు మెదక్–అక్కన్నపేట రైలు మార్గం. దీనికి రైల్వే తన వంతు వాటా నిధులు విడుదల చేసి పనులను చివరి దశకు చేర్చింది. కానీ రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా నిధులు ఇవ్వట్లేదని ఇప్పుడు కినుక వహించింది. గత బడ్జెట్లో రూ.10 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తే, తుది దశలో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేందుకు మరింత జాప్యం తప్పదు. -
వైఎస్సార్ ఆశయాలే వైఎస్ జగన్ ఆలోచనలు
-
ప్యాకేజీ 20.. టార్గెట్ 2020..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు నీటి పారుదల శాఖ తాజా లక్ష్యాలను నిర్దేశించుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పూర్తయ్యే లోపు దానికి అనుసంధానమైన జిల్లా పరిధిలోని కాళేశ్వరం 20వ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల ప్రగతిపై ఇటీవల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లా సరిహద్దుల్లో ఉన్నరాజేశ్వర్రావుపేట్లోని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం రెండో పంప్‌హౌజ్ పనులను సైతం సందర్శించారు. ఆయా ప్రాజెక్టుల ప్రగతిపై కూడా ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం విధితమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జిల్లాలో 20వ ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. సుమారు తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్యాకేజీకి సంబంధించి నీటి పారుదల శాఖ తాజాగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2019 డిసెంబర్ చివరి వరకు ఈ పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇవీ పనులు.. నవీపేట్ మండలం బినోల వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌ను మాసాని చెరువు వరకు ఎత్తిపోసుకునే పనులు 20వ ప్యాకేజీ పరిధిలో ఉన్నాయి. రూ.892.67 కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ పనులను ఐవీఆర్సీఎల్, బీఏటీపీఏఎస్సీఓడబ్ల్యూపీఐఎల్, ఎంహెచ్ఐ అనే మూడు కంపెనీలు జాయింట్ వెంచర్లో చేస్తున్నాయి. అప్రోచ్ చానెల్, టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌజ్ నిర్మిస్తున్నారు. ఎలక్ట్రో, హైడ్రో మెకానికల్ పనులు కూడా వీటి పరిధిలోనే ఉన్నాయి. ఈ పనుల కోసం అవసరమైన 832 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేశారు. సుమారు తొమ్మిదేళ్లుగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా టన్నెల్ నిర్మాణం.. ఈ ప్యాకేజీలో టన్నెల్ నిర్మాణం పనులు ప్రధానమైనవి. 17.8 కిలోమీటర్ల మేరకు టన్నెల్ నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 16.9 కి.మీ. మేరకు తవ్వకం జరిగింది. ఇంకా 830 మీటర్లు తవ్వకం జరగాల్సి ఉంది. ఈ పనులను ఈ ఏడాది మే నాటికి పూర్తిచేసేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చేపట్టింది. ఈ టన్నెల్ లైనింగ్ పనులు మాత్రం డిసెంబర్ వరకు చేయాలని నిర్దేశించుకుంది. పంప్‌హౌజ్ తవ్వకం దాదాపు పూర్తికాగా, లైనింగ్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సర్జ్‌పూల్‌ను జూన్ నాటికి, అర కిలోమీటరు పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ చానెల్‌ను మరో ఐదు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాలువ నిర్మాణం కూడా డిసెంబర్ వరకు గడువు పెట్టుకున్నారు. మొత్తం మీద ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులయ్యేలోగా, ఈ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 75శాతం పనులు పూర్తయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీకి సంబంధించి 75 శాతం పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌజ్ నిర్మాణంలో భాగంగా పంపులను బిగిస్తున్నారు. టన్నెల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇంకా ఎనిమిది వందల మీటర్లు జరగాల్సి ఉంది. ఈ ప్యాకేజీ పనులు వీలైనంత త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేక దృష్టి సారించాం. –ఆత్మారాం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, -
గురి తప్పిన గాండీవం
కనిగిరి(ప్రకాశం): క్రీడాభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టు గాండీవం లక్ష్యాన్ని గురిపెట్టడం లేదు. ఎంతో ప్రచార ఆర్భాటంగా చేపడుతున్న ఈ పథకం లక్ష్యం మంచిదే అయినా క్షేత్ర స్థాయిలో కనీస వసతుల సమకూర్చలేదు. దీంతో విద్యార్థుల్లో క్రీడాభివృద్ధి మాటల గారడిగానే మారనుందనే విమర్శలున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లో మొత్తం 2,985 పాఠశాలలుండగా, అందులో 2,411 ప్రాథమిక, 179 ప్రాథమికోన్నత, 395 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటికి సంబంధించి గతేడాది లెక్కల ప్రకారం 4,78,050 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలో 150 మంది పీడీలు, 250 మంది పీఈటీలున్నారు. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో 464 ప్రభుత్వ పాఠశాలుండగా అందులో సుమారు 29,226 మంది విద్యార్థులున్నట్లు అంచనా. కనిగిరి మండలంలో సుమారు 10 వేల మంది విద్యార్థులున్నారు. జూలై 1 నుంచి 12 వరకు పాఠశాల స్థాయిలో.. 13 నుంచి నెలాఖరు వరకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతి పాఠశాలలో 6–10 తరగతి తరగతి విద్యార్ధులను 20 మందిని ఎంపిక చేసి మండలానికి 250 మందిని క్రీడా ప్రతిభ కలిగిన వారిని జిల్లా స్థాయికి పంపారు. జిల్లా మొత్తంలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరిలో కొందరిని జల్లెడపట్టి ప్రతిభ కలిగిన వారిని వెయ్యిమందిని గాండీవం క్రీడలకు వెలికితీసి క్రీడా శిక్షణ ఇస్తారు. మిగతా వారిని పాంచజన్యకు (రెండో విడతకు) ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 100 శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయగా, జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో కనిగిరి మండలం కంచర్లవారిపల్లి, ఇంకొల్లు, కరేడు, యద్దనపూడి, కొత్తపట్నం, ఉలవపాడులలో శిక్షణా కేంద్రాలు నిర్వహించనున్నారు. వాస్తవికత ఇదీ.. క్రీడాకారుల ఎంపికలో క్షేత్ర స్థాయిలో 9 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఎత్తు, బరువు, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ, షటిల్ రన్, స్పీడ్‌రన్, స్టాండింగ్ జంప్, మెడిసిన్‌బాల్, 200 మీటర్స్ రన్ వీటిలో జిల్లాలోని 56 మండలాల్లో ఐదు, ఆరు మండలాల్లో తప్పా ఎక్కడా 200 మీటర్ల పరుగుపందెం నిబంధన ప్రకారం జరగలేదు. ఎందుకంటే ఎక్కడా రన్ ట్రాక్ లేదు. అంతేగాక టెన్వీక్స్ సంస్థ నిర్దేశించిన సమయంలో 200 మీటర్ల పరుగును 10 ఏళ్ల విద్యార్థి 30 సెకండ్లల్లో, 16 ఏళ్ల విద్యార్థి 25 సెకండ్లలో పరుగు పెట్టడం అసాధ్యం. దీన్ని బట్టి చూస్తే లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరే అవకాశం లేదు. క్రీడా మైదానాలకు గ్రహణం.. జిల్లాలో క్రీడా మైదానాల అభివృద్ధికి గ్రహణం ఏర్పడింది..ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద జెడ్పీ ఉన్నత పాఠశాలల గ్రౌండ్ల అభివృద్ధికి గతేడాది పనులు చేపట్టింది. (ఎన్ఆర్ఈజీఎస్, ఉపాధి కూలీలు) లేబర్ వర్క్ తో సగం, మెటీరియల్ కాంపోనెంట్‌తో సగం ఫిప్టి, ఫిఫ్టిగా ఒక్కో పాఠశాల ప్లే గ్రౌండ్ అభివృద్ధికి రూ.5 లక్షల అంచనా విలువతో మంజూరు చేశారు. అందులో రన్నింగ్ ట్రాక్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్ట్లు తయారు చేయాల్సి ఉంది. అంచనా విలువలు తగ్గించడం.. రాజకీయ జోక్యాలు.. ఇలా కారణాలు ఏమైనా జిల్లాలో 15 శాతం క్రీడా మైదానాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది మంది క్రీడా విద్యార్థులు ఆట స్థలాలకు దూరంగా ఉన్నారు. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 82,321 మంది విద్యార్థులు చదువుతున్నారు. వేలాది మంది విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తితో చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని 56 మండలాల్లోని 290 జెడ్పీ, ఉన్నత పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా మొదటి విడతగా..232 స్కూల్స్‌ను అనుమతి ఇచ్చారు. వాటిలో 20 శాతం కూడా ప్లే గ్రౌండ్లు పూర్తికాలేదు. కొన్ని చోట్ల ఆరంభానికే నోచుకోలేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కనిగిరిలో 6, హెచ్‌ఎంపాడులో 5, పామూరులో 5, సీఎస్‌పురంలో 5, వెలిగండ్లలో 6, పీసీపల్లిలో 5 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్లే గ్రౌండ్లు మంజూరు కాగా వాటిలో 10 శాతం మాత్రమే పనులు ప్రారంభమై ఆరంభం శూరత్వంగా నిలిచాయి. హెచ్‌ఎంపాడు మండలంలో మొహమ్మదాపురం పాఠశాలలో కొన్ని పనులు జరిగాయి. కారణాలు ఏమైనా కనిగిరి మండలంలో పాతపాడు, ఏరువారిపల్లి, గురువాజీపేట, దిరిశవంచలో అసలు మొదలు కాలేదు. తాళ్లూరు, కంచర్లవారిపల్లిలో గ్రౌండ్‌ను తవ్వి వదిలేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్ధులు ఆటకు అనేక అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఆయా పాఠశాలల్లో కనీస నడిచే పరిస్థితి లేదు. -
ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం
సాగునీటి ప్రాజెక్టుల వద్ద నిద్రించైనా పెండింగ్ పనులను పూర్తి చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 మే 12న బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థను పరిశీలించిన సమయంలో రైతాంగానికి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ పెండింగ్ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్ ప్రారంభాన్ని ఏటేటా వాయిదా వేçస్తూ.. పెండింగ్‌లో ఉన్న 15 శాతం పనులను పూర్తి చేయించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. జూపాడుబంగ్లా(కర్నూలు): రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, తమిళనాడులోని చెన్నై ప్రాంతాలకు తాగు, సాగునీటికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండెకాయ లాంటిది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపునకు ఉద్దేశించిన నూతన హెడ్‌రెగ్యులేటర్ పెండింగ్ పనులను పూర్తి చేసి..ప్రారంభోత్సవం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పెండింగ్‌లో ఉన్నది 15 శాతం పనులే అయినప్పటికీ వాటిని కూడా పూర్తి చేయలేకపోతోంది. 2015 మార్చి 5న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంద రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయించటంతో పాటు 2015 జూన్ నుంచి నూతన హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయిస్తానని ప్రకటించారు. సీఎం, మంత్రి ఇరువురూ ప్రాజెక్టులను సందర్శించి మూడేళ్లకు పైగా అవుతున్నా పనులు మాత్రం పూర్తి చేయించిన దాఖలాల్లేవు. పెండింగ్ పనులపై శ్రద్ధేదీ? రూ.201.347 కోట్ల అంచనా వ్యయంతో 2006 డిసెంబరులో నూతన హెడ్‌రెగ్యులేటర్ పనులు ప్రారంభమయ్యాయి. 2010 నాటికి దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. పనుల పెండింగ్ కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో ఏటా టీఎంసీల కొద్దీ నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. 16.5 కి.మీ మేర ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్ఆర్ఎంసీ)ను బానకచర్ల వద్ద విస్తరించాల్సి ఉంది. అలాగే కాలువలో పూడిక తొలగించాలి. 0 నుంచి 9 కి.మీ వరకు కాలువ ఎడమగట్టును పటిష్టంచేసి.. స్టాండర్డు బ్యాంకు నిర్మించాల్సి ఉంది. కాలువ కుడిగట్టు వెంట బీటీ రహదారిని, నాలుగు ప్రాంతాల్లో వంతెనలను, అధికారుల నివాసగృహాలు, కంట్రోల్‌రూంను నిర్మించాలి. ఈ పనులన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. పూర్తికాని ఎస్ఆర్బీసీ విస్తరణ పనులు పోతిరెడ్డిపాడుకు దిగువన ఉన్న తెలుగుగంగ, కేసీఎస్కేప్ కాలువలు 11వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుకూలంగా ఉన్నా.. శ్రీశైలం కుడి ఉప కాలువ (ఎస్ఆర్బీసీ)ను మాత్రం 22వేల క్యూసెక్కులకు అనుగుణంగా విస్తరించలేదు. విస్తరణ పనులు నేటికీ కొన..సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలువకు 4 –5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గట్లు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎస్ఆర్బీసీని విస్తరించేదాకా 22వేల క్యూసెక్కుల నీటిని సరఫరాచేసే అవకాశం లేదు. నిర్వహణ లోపంతో గేట్ల మొరాయింపు నీటిసరఫరా నిలిచిన వెంటనే అధికారులు హెడ్‌రెగ్యులేటరు గేట్లకు మరమ్మతులు చేపట్టి.. నీటివిడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. అయితే.. ఇవేవీ పట్టించుకోకపోవటంతో పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల గేట్లు తుప్పుపట్టి ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేం అన్నట్లుగా మారాయి. కొత్త హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న పదిగేట్లలో ఆరు గేట్లకు రబ్బర్‌షీల్స్ ఊడిపోయాయి. వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించకముందే డ్యాంలోకి నీళ్లు రావటంతో పనులు నిలిచిపోయాయి. మొండికేసిన కాంట్రాక్టర్లు 0 నుంచి 9 కిలోమీటర్ల మేర స్టాండర్డు బ్యాంకును నిర్మించేదిలేదని కాంట్రాక్టర్లు అధికారులకు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరితే బ్యాక్‌వాటర్ కారణంగా ఎస్ఆర్ఎంసీ ఎడమగట్టుకు అభద్రత నెలకొనే ప్రమాదం ఉంది. 2009 వరదల సమయంలో బలహీనంగా ఉన్న ఎడమగట్టు తెగి.. దిగువన ఉన్న నంద్యాల పట్టణంతో పాటు మరికొన్ని ప్రాంతాలు మునకకు గురయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేయించటంతో పాటు నూతన హెడ్‌రెగ్యులేటరు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. కొంత సమయం పడుతుంది పోతిరెడ్డిపాడు నీటినియంత్రణ వ్యవస్థ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గాలేరు నగరి గేట్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అలాగే ఎర్రగూడూరు వద్ద ఎస్ఆర్ఎంసీ పనులు పూర్తికావాలి. వీటితోపాటు కంట్రోల్‌రూం, బీటీరోడ్డు నిర్మాణం, స్టాఫ్‌రూం, స్టాండర్డ్బ్యాంక్ నిర్మాణ పనులు త్వరలో చేపడతాం. – మనోహర్‌రాజు, ఈఈ, పోతిరెడ్డిపాడు -
సంద్ర
సార్ పోస్ట్. పడకదిగి వెళ్లి పోస్ట్ తీసుకున్నా. ఎవరు రాశారు అని చూస్తే, టుడియర్ పోయెట్. ఫ్రమ్ సంద్రఏం రాసుంటుంది. అని తెరచి చూస్తే, మై డియర్ పోయెట్! కవిత్వం అంటే పారిపోయే నీవు ఎంత బాగా రాస్తున్నావ్. ఎప్పుడూ అకడమిక్ పుస్తకాలు దాటి చూడని నీవు, ఈమధ్య లేఖలో రాసే ప్రతి వాక్యంలో వచనమే రాస్తున్నావ్. క్రితంసారి నువ్ రాసిన లేఖ ముగింపుని ఎన్నిసార్లు చదువుకున్నానో. బాగా నచ్చిందోయ్. నిజంగా! ఒక్కమాట చెప్పనా, నాకన్నా బాగా రాస్తున్నావ్. ప్రౌడ్ ఆఫ్ యు స్టుపిడ్. నా రీసెర్చ్ మొత్తానికి అయిపోయింది. అది అయిపోగానే నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఒకటే ఆత్రం. ఈ ఐదేండ్ల ఎడబాటును చెరిపేస్తూ నీ దరికి వస్తున్న.బోలెడంత ప్రేమతో సంద్ర అచంచలమైన ప్రేమను లేఖల్లో వ్యక్తపరచే తను, ఐదేండ్ల తరువాత కళ్లముందుకు వస్తున్నట్టు రాసింది. ఎప్పుడు వస్తుంది? మళ్ళీ చదివా. తారీఖు చూస్తే రేపే వస్తున్నట్టుంది. తన జ్ఞాపకాల్లో కాలం గడిచిపోయింది. గడచిన కాలమంతా ఒకవైపు. ఆమెతో కలసి నడచిన కాలం ఒకవైపు. స్వేచ్ఛగా ఉండటం అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే తనని చూపిస్తే సరిపోతుందేమో. తన స్వేచ్ఛను ప్రకటించి పోయిన తను, ఎప్పటిలాగే ఉత్తరమై పలకరించింది. ఈసారి ఎడబాటును ఓపమని గాక ఎడబాటును చెరిపెయ్య వస్తున్నట్టు.ఇప్పుడంటే ఇట్లా రాస్తున్నాను గానీ తన పరిచయం లేకముందు ఎంత ముభావంగా ఉండేవాడ్నో తలచుకుంటే నవ్వొస్తుంది. ఎంత అందమైనవి తన తలపులు. కేవలం అందమైనవేనా? అద్భుతమైనవి. ఎట్లా వచ్చింది తను జీవితంలోకి. గుడ్లగూబ కళ్ళది. ఇంతింత కళ్లేసుకొని. ఏంటి ఈ పిల్ల ఇట్లా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతుంది అనుకునేవాణ్ణి. ఓ రోజు యూనివర్సిటీలో నడుస్తూ ఉంటే వెనకనుండి నెత్తిపై మొట్టి, వెనక్కి తిరగగానే కౌగిలించుకుంది. ‘ఏంట్రా ఈ మధ్య కనపడట్లేదు’ అని అత్యంత సహజంగా అడిగింది. ఏంటి ఈ పిల్ల పరిచయమై నాలుగు రోజులన్నా కాలేదు.. ఏదో ఏండ్ల నుండి సావాసం ఉన్నట్లు మాట్లాడుతుంది. నడిరోడ్డుపై కావలించుకుంటుంది. ఈలోకంతో పట్టింపులేనట్లు. ఏదో ఓ సందర్భంలో కలవడం, మాట్లాడటం దినచర్యలాగానే అయిపోయింది. ఓ రోజు తన స్నేహితురాలి ఇంటికి పోవాలి రా అని పిలిచింది. వెళ్లి వాళ్ళింట్లో కూర్చోని మాట్లాడుతుంటే ఓ ముసలమ్మ వచ్చి మా ఇద్దరిని పరీక్షగా చూసి ఎదురుగా కూర్చుంది. ‘ఓయ్ అమ్మాయ్, ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఆ ప్యాంటు, షర్టు వేసుకుని రాకపోతే ఎంచక్కా లంగా, ఓణిలో రావచ్చు కదా!’‘రాకూడదని ఏమి లేదు బామ్మా! లంగా ఓణిలో బండిపై ఆటోకాలు, ఇటోకాలు వేసుకొని కూర్చోవడం కాదు అనే వేసుకోట్లేదు. ఈ ప్యాంటు, షర్టు కన్నా కూడా చిన్న చిన్న నిక్కర్లు బాగా సౌకర్యంగా ఉంటాయి. వచ్చేసారి అవి వేసుకొని వస్తాలే’ఈ పిల్ల అన్న మాటలకు ముసలామే ఊకుంటదేమో అనుకున్నా. అంతలోనే అడిగింది – ‘అవును అమ్మాయ్ ఇంతకీ మీరేంటి?’‘మీరేంటి అంటే ఈ దేశంలో, మీదే కులమనేగా? అదేనా బామ్మ నువ్వు అడుగుతోంది?’‘– అవుననుకో’‘నాకు ఒక కులమంటూ లేదు. అయ్యదో కులం. అమ్మదో కులం. ఇక మతమంటావా! నాన్న కొద్దిగా భక్తుడు. అమ్మకు ఏ నమ్మకాలూ లేవు.’‘అంటే దేవుడ్ని కూడా నమ్మదా ఏంటి?’‘ఉంటే కదా బామ్మ నమ్మడానికి.’ ‘ఏందో అమ్మా! బొత్తిగా ఈ కాలం పిల్లలకు భయము, భక్తి లేకుండా పోతోంది.’ అంటూ వెళ్ళిపోయింది. ఉదయాన్నే లేవగానే తన నుండి ఫోన్. అర్జంట్‌గా హాస్టల్‌కి రమ్మని. వెళ్లి వేచి చూస్తుంటే మెల్లిగా వచ్చింది. మోకాళ్ళపైకి షార్ట్, క్రాప్డ్ టాప్‌తో. జనాల కళ్ళన్నీ తన కాళ్ళ మీదే. వచ్చి బ్యాగులోంచి ఓ పుస్తకం తీసి, పెన్ను ఉందా అని అడిగి ఏదో రాసిచ్చింది. రూముకెళ్లేదాకా పుస్తకం చూడొద్దని బాసతీసుకుని మరీ. రూముకెళ్లి ప్రాజెక్ట్ వర్క్ రాస్తుండగా ఫోన్ చేసింది. ‘రేయ్ ఇంతకీ చదివావా.. లేదా..’ అని. అప్పటికి గానీ గుర్తుకురాలేదు. తను పుస్తకంలో రాసిన సంగతి. ‘లేదు. ప్రాజెక్ట్ వర్క్ రాస్తున్నా. చదువుతా’ అన్నా. ‘నువ్వు, నీ ప్రాజెక్టు వర్కులు.. ఇవేగాక జీవితంలో చెయ్యాల్సినవి చాలా ఉన్నాయిరా బాబు. ముందు అది చదివి కాల్ చెయ్’అప్పుడు తెరిచా పుస్తకాన్ని, తనేం రాసిందో చదవడానికి. ‘మై డియరెస్ట్.నా ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు, నా భావాల్ని చెప్పేందుకు సరిపోయే నా ప్రియకవి పాబ్లో కవితని పంపుతున్నా. కవితలో ప్రతి పదం, ప్రతీ పాదం నీపై నా అనుభూతే. నీది సహానుభూతి కావాలని ఆశిస్తూ. నీ సమాధానంకై వేచి చూస్తూ.’ అంటూ ఓ కవిత పంపింది. తను రాసింది చదవగానే కాల్ చేశా. ‘ఏంట్రా చదివావా?’‘– చదివాను. నువ్ ఏదో ఇష్టాన్ని చెప్పాలని రాశావ్. ఆ కవిత సరిగా అర్థం కాలేదు. నువ్వంటే నాకు ఇష్టమే కానీ, ఇంతకీ అనుభూతి, సహానుభూతి కావడం అంటే ఏంటి?’‘ఒసెయ్, పిచ్చిమొద్దు. అంతలా నీకోసం రాస్తే అర్థం కాలేదు అంటావేంట్రా!’‘– నిజంగా అర్థం కాలేదు.’‘అది ప్రేమలేఖరా బాబు.. నిన్ను ప్రేమిస్తున్నానని లేఖ రాశా.’ ఊహించని పరిణామానికి నా వైపు నుండి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ, ‘రేయ్ నాకు అనిపించింది చెప్పిన, నీకు ఏమనిపిస్తే అది చెప్పు.’ అని ఫోన్ పెట్టేసింది. మర్నాడు యూనివర్సిటీలో కలిసింది. ఏమీ జరగనట్టే, ఏమీ ఎరగనట్టే అత్యంత సహజంగా, ఎప్పటిలాగే పలకరించింది. కాసేపు అలా దిక్కులు చూస్తూ, మధ్య మధ్యలో పుస్తకాన్ని తిరగేస్తూ మాట్లాడుకున్నాం. మాటల్లో మాటగా, ‘అవును. నిన్న లేఖ ఎందుకు రాశావ్?’ అని ఆడిగేశా.‘ఎందుకు రాశానో నిన్ననే చెప్పాను కదా’ ఒక్కటే సమాధానం. ‘అసలు ఎందుకు రాశావ్?’ మరో ప్రశ్న.‘అదికూడా నిన్ననే చెప్పినా కదా?’ మళ్ళీ అదే సమాధానం.‘అదే ఎందుకు?’ ‘పైకి ఇలా ముద్దపప్పులా కనిపిస్తావ్ గానీ, నీకు సమాజం పట్ల మంచి కన్సర్న్ ఉంది.’ ‘అయితే ప్రేమిస్తారా?’‘నాపట్ల కూడా అంతే కన్సర్న్ ఉంది. అందుకు ప్రేమించా.’‘నీకెలా తెలుసు?’‘వేసుకున్న బట్ట కాస్త పక్కకి తొలగితేనే, చూపులు తిప్పుకోని జనాలున్న చోట, నువ్వెప్పుడూ ఏ అమ్మాయినీ అట్లా చూడలేదు. అంతెందుకు ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకు తిరిగే నన్ను, నాలాగే చూశావ్. నీ దోస్తులంతా, నా బట్టల్ని కామెంట్ చేస్తుంటే నువ్వు వాళ్లను మందలించావు. నచ్చేశావ్. పైకి కనిపించే ముద్దపప్పువేం కాదు అనిపించింది అప్పుడు.’‘సంద్ర ఒక మాట చెప్పనా? నీలాంటి ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయితో కలిసి బతకాలంటే నేనూ నీలాగే ఉండాలి. నేను కాస్త రిజర్వ్డ్. నువ్వేమో అలా కాదు. కలిసిన వెంటనే కలిసిపోతావ్. నాలుగు రోజుల్లోనే ఆ మనిషిపై ఒక అంచనాకి వస్తావ్. ఇదిగో ఇలా కలిసి నెల రోజులన్నా కాలేదు ప్రపోజ్ చేశావ్. నేను ఇలాగే ఉంటాను. నీలాగ ఉండలేను.’ ఓరే ముద్దపప్పు, నువ్వు నీలాగ ఉన్నావు కాబట్టే నచ్చావ్. నాలాగా ఉండాలనే, మారాలనే స్వార్ధమేమీ లేదు నాకు. అయినా నువ్వు నీలాగే, నేను నాలాగే ఉంటూ, ఇద్దరం ఒక్కటిగా ఉండటం ఎంత బావుంటుంది? నువ్వు నన్ను నీలా మారమని కాకుండా, నాలా ఉండలేనని అంటున్నావ్ చూడు అందుకు ఇంకా నచ్చావ్. నువ్వు నీలాగే ఉండు. నన్ను నాలాగే ఉండనివ్వు. నీకు ఇష్టముంటే, నేను ఇంకొకడిని చూసుకోక ముందే చెప్పు.’‘అంటే నాకోసం, నా జవాబు కోసం ఎదురుచూడవా?’‘ఈ ఎదురుచూపులు, నువ్వు కాదన్నావని కన్నీరు మున్నీరై విలపించడాలు సినిమాల్లో బాగుంటాయి. నా వంటి వాడికి పడవు. నువ్వు నచ్చావని నేను స్వేచ్ఛగా చెప్పినపుడు. నీకు నచ్చలేదనో, ఇంకేదో చెప్పే స్వేచ్ఛ నీకుంది. సరే నేను మీటింగ్‌కు పోవాలి. కలుస్తా.’ కాలం ఎవరి కోసం ఆగదు కదా. కాలం ఒక జీవనది. అది ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పటిలాగే రూంకి వచ్చిన సంద్ర, ‘రేయ్ నాకు సముద్రం చూడాలని ఉంది!’ అంది. ‘సరే, ప్లాన్ చేద్దాంలే!’ అని నేనంటే వినిపించుకోలేదు. అప్పటికప్పుడు గోవాకు రెండు టికెట్లు బుక్ చేసింది.æబీచ్‌కి వెళ్ళగానే తీరంలో కూర్చొని తదేకంగా సముద్రం వంక చూస్తోంది. ‘అంతలా ఏం చూస్తున్నావ్ సంద్ర?’ అనడిగా. ‘ఎగిసిపడే అలల్ని. తీరం తాకి, వెనక్కి మళ్లే అలల్ని. అలలు సముద్రంలోకి పోతున్నప్పుడు జాలువారే ఇసుకని. అదుగో దూరంగా నేల, ఆకాశాన్ని కలుపుతున్నట్టు ఉన్న దృశ్యాన్ని. ప్రశాంతంగా అలలు చేసే శబ్దాన్ని విను. ఏ సంగీతకారుడు పలికించగలడు దీన్ని?’‘సముద్రం అంటే అబ్సెషన్ ఎందుకు సంద్ర?’ ‘నేనే సముద్రం కాబట్టి,’ నవ్వింది.‘అవునూ ఇంతకీ సంద్ర అంటే అర్థం ఏమిటి?’ ‘సంద్ర అనే పేరు ఉందో, లేదో తెలియదు. అమ్మకి సముద్రం అంటే ఇష్టం. అందుకే సముద్రాన్ని షార్ట్‌గా చేసి, సంద్ర అని పెట్టుకుంది. నాకు సముద్రాన్ని చూడటం అమ్మతోనే అలవాటయింది. నాన్న దూరమయ్యాక ఇద్దరం ఇలా సముద్రతీరంలో గంటలు, గంటలు, రోజులు, రోజులు గడిపేవాళ్ళం. అమ్మ లేకుండా సముద్రాన్ని చూడటం ఇదే మొదటిసారి.’ అంటూ భుజంపై తలవాల్చింది. ఎప్పుడూ పైకి ప్రశాంతంగా కనిపించే సంద్రలో ఇంత విషాదమూ ఉందా. అయినా బయట పడదేంటి. ఏమో ఈ పిల్ల అర్థం కాదు. అర్థమయినట్టే అనిపించే అర్థంకాని పిల్ల. సూర్యుడు సముద్రంలోకి మాయమయ్యే దృశ్యాన్ని చూపిస్తూ, మెడపై చేతులు వేసి కావలించుకుంది. పొద్దటినుండి అలసిపోయి బెడ్‌పై పడుకోగానే, వచ్చి పక్కన పడుకుంది. మాటల్లో కాసింత కాలం గడిచిపోయింది. కాసేపు మాటల్లేని యుద్ధం. తొలికలయికలో కార్చిన కన్నీళ్లను తను దాచాలనుకున్నా, చెదిరిన కాటుక తన కన్నీళ్లకు సాక్షం చెప్పింది. కాసేపు కిటికీలోంచి బయటకు చూసి, ఏదో రాసుకుంది. పొద్దున లేచేవరకు చుట్టూ చేతులు వేసి అల్లుకొని పడుకుంది. మెల్లిగా పక్కకు జరిపి పడకదిగి టేబుల్ ముందు కుర్చీలో కూర్చొని చూస్తుంటే, దూరంగా సూర్యోదయం. పక్కనే రాత్రి తను రాసిన పుస్తకం. తెరచి చూశా. ‘కిటికీలోంచి బయటకి చూస్తే, చూపుకు దగ్గరగా, అయినా అందుకోలేనంత దూరంగా సముద్రం. తీరాన్ని తాకుతూ అలలు. అనిర్వచనీయ ప్రేమను వ్యక్తికరించిన క్షణాలు. గుర్తుకురాగానే ఎరుపెక్కిన బుగ్గలు. వాన్నలా చూస్తుంటే మళ్ళీ ఓసారి ఊపిరి ఆపేసినంత పనిచేసి ఊపిరి పోయాలనిపిస్తుంది.’ చదివాక ఏదో చెప్పలేని అనుభూతి. మళ్ళీ పడుకున్నా. ఓరోజు హడావుడిగా రూంకి వచ్చి, ‘రేయ్ నాకు ఆక్స్‌ఫర్డ్‌లో సీటు వచ్చింది. ఇంకో పది రోజుల్లో ప్రయాణం..’ అంది. ‘వాట్? అంటే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తావా?’ ‘నీకు తెలుసుకదా నాకు అక్కడ చదవడం కల అని. అయినా నేనేం నిన్ను వదిలేసి పోవట్లేదు. రీసెర్చ్ కోసం పోతున్నా. మళ్ళీ వస్తా కదా.’ ‘ఊహు, వెళ్లడం మానెయ్. ఇక్కడే రీసెర్చ్ చేద్దాం.’ ‘సారీ డార్లింగ్, నో కాంప్రమైజ్ ఆన్ మై డ్రీమ్. అయినా నీకు ముందే చెప్పా కదా. కొత్తగా ఇదేంటి. డోంట్ బి పోసేసివ్.’ ‘అదంతా నాకు తెలియదు. కాంట్ లివ్ వితౌట్ యు.’ ‘డోంట్ బి స్టుపిడ్. ఒక్క ఫైవ్ ఇయర్సే కదా.’అంతే. సంద్ర ఫిక్స్ అయితే ఎవ్వరి మాటా వినదు. ‘నీ ఇష్టమైనప్పుడు రా. అంతవరకు, అంతే ప్రేమతో ఎదురుచూస్తుంటా’ అన్నా. మాట్లాడటం అయిపోగానే గట్టిగా హత్తుకుంది. అప్పుడు కలిసిన తను. ఆ తర్వాత నుండి మెయిల్ కాలంలో కూడా ఉత్తరమై పలకరిస్తూనే ఉంది. ఎప్పుడు రాసినా ఏదో కొత్త విషయం. ఏదో తెలియని ఉత్సుకత ఉంటుంది తన ఉత్తరాలలో. మళ్ళీ మళ్ళీ చదివించేలా రాస్తుంది. ఎప్పుడు చదివినా అదే కొత్తదనం. ఎట్లా అబ్బింది తనకు ఇట్లా రాయడం. బహుశా బాగా చదవడం వల్లేమో. తను వస్తుందనే విషయం ఒక్కచోట కాలు నిలవనివ్వడం లేదు. సంద్ర. తిరిగొస్తోంది. నాకోసం వస్తోంది.డోర్ బెల్ మోగిన మోత. ఇప్పుడెవరో అనుకుని ఒక నడక, చేతిలోని ఉత్తరం బల్లపై పెట్టి, తలపులనుండి బయటపడి తలుపు వైపు. -
పండుగ ముందు విషాదం
దేవరకొండ: ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసిన గుంత ఐదుగురు చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంది. చిన్న గుంతనే.. అనుకున్న 8 ఏళ్లలోపు చిన్నారులు ఈత కొట్టేందుకు అందులోకి దిగడంతో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల పంచాయతీ పరిధిలోని గుడితండాలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. గుడితండాకు చెందిన నేనావత్ ఓంకారం, సరస్వతి దంపతుల ఇద్దరు కుమారులు సంతోష్(7), రాకేష్(5), అదే తండాకు చెందిన నేనావత్ హన్మా, కుమారి దంపతుల ఇద్దరు కుమారులు నవదీప్ (6), సాత్విక్ (7), సర్దార్ అనే వ్యక్తి కుమారుడు శివ ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్ననికే ఇంటికి వచ్చారు. భోజనం చేశాక పెండ్లిపాకల ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో బండ్ నిర్మాణం కోసం తీసిన గుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. ఓ వైపు మూడు, మరో వైపు ఏడెనిమిది అడుగులలోతు ఉన్న ఆ గుంత లో దిగాక నీట మునిగి ఊపిరాడక ఐదుగురూ మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవర కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోష్, కొండమల్లేపల్లిలోని గౌతమి పాఠశాలలో 2వ తరగతి, రాకేష్ ఎల్కేజీ చదువుతున్నాడు. నవదీప్ కొండమల్లేపల్లిలోని విజయ మేరి స్కూల్లో ఫస్ట్ క్లాస్, సాత్విక్ కూడా అదే పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. మరో చిన్నారి శివ గౌతమి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. కొడుకులనూ బలితీసుకుంది.. ‘‘పెండ్లిపాకల ప్రాజెక్టు కోసం కూడుపెట్టే పొలాన్ని ఇచ్చేశాం... సర్వస్వం పోయి కూలి పనులు చేసి బతుకుతున్నాం... ఇప్పుడదే ప్రాజెక్టు మా పిల్లలనూ బలితీసుకుంది. ఉన్న పొలం.., కన్న కొడుకులు పోయాక ఇక మేం బతికి మాత్రం లాభం ఏముంది... మేమూ చచ్చిపోతాం’’అంటూ పిల్లల తల్లిదండ్రులు ఆస్పత్రివద్ద రోదించారు. -
గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో డొల్ల
-
పోలవరం పూర్తికి అన్ని చర్యలు : దేవినేని
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడి కాల్వను ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో కలిసి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును అనుకున్న ప్రకారం 2018కు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టు వద్ద వారానికి 14 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించాల్సి ఉండగా 12 లక్షల వరకు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ ఖరీఫ్‌లో 45 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని, 10.74 లక్షల ఎకరాల పంట పొలాలతో పాటు లక్షా 50 వేల ఎకరాల చేపల చెరువులకు సాగునీరందించామని వివరించారు. కాగా, ఎన్టీఆర్ కల అయిన తెలుగుగంగను 2017 నాటికి పూర్తి చేస్తామని మంత్రి దేవినేని చెప్పారు. పట్టిసీమ స్ఫూర్తితో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరి వెంట ఎస్ఈ శ్రీనివాసయాదవ్, ఈఈ చినబాబు తదితరులు ఉన్నారు. -
ఏలేరు ఆధునికీకరణ సకాలంలో పూర్తిచేయాలి
ఉభయ గోదావరి జిల్లాల చీఫ్ ఇంజనీర్ ఎస్.హరిబాబు కిర్లంపూడి : ఏలేరు కాలువ ఆధునికీకరణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఉభయ గోదావరి జిల్లాల చీఫ్ ఇంజనీర్ ఎస్.హరిబాబు అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ముక్కొల్లు, భూపాలపట్నం, రాజుపాలెం గ్రామాల్లో ఏలేరు కాలువను ఆయన పరిశీలించారు. ఏలేరు ఆధునికీకరణలో భాగంగా కాలువను ఆనుకుని ఉన్న గ్రామాలకు నష్టం వాటిల్లకుండా డిజైన్ మార్పు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ముక్కొల్లు గ్రామంలో కాలువకు ఇరు పక్కలా సిమెంటు గోడలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఆయన వెంట ఎస్ఈ రాంబాబు, ఈఈ జగదీశ్వరరావు, డీఈ కృష్ణారావు, ఇతర ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. -
గడువు లోపు పూర్తి చేయలేదు..
♦ అందుకే కాంట్రాక్టులను రద్దు చేశాం ♦ ‘దుమ్ముగూడెం’పై హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కార్ సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావ్ పూలే దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టేల్పాండ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ఆయా కాంట్రాక్టర్లు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయలేదని, అందువల్లే నిబంధనల మేర కాంట్రాక్టులను రద్దు చేశామని ఉమ్మడి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. ప్రాజెక్టు పనులు దక్కించుకున్న పది కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ నిబంధనలకు అనుగుణంగా పనులు పూర్తి చేయలేదని, ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ చేసిన సిఫారసులను అనుసరించి ఆ కంపెనీలపై చర్యలకు ఉపక్రమించామంది. ఈ విషయంలో పిటిషనర్ అభ్యంతరాలన్నీ ఊహాజనితమైనవంది. పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఈ వ్యాజ్యం దాఖ లు చేశారని, అందువల్ల దీన్ని కొట్టేయాలని కోర్టును అభ్యర్థించింది. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 8న జారీ చేసిన జీవో 30ని కొట్టేసి, టెండర్లను రీనోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలంటూ నెల్లూరుకు చెందిన ఎన్.డోలేంద్రప్రసాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు దుమ్ముగూడెం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వి.సుధాకర్ ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని పిటిషనర్ చెబుతున్నారని, అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రయోజనం అన్నది ఆయా రాష్ట్ర అవసరాలను బట్టి ఉంటుందని ఆయన తెలిపారు. డోలేంద్రప్రసాద్ తన వ్యాజ్యంలో జిల్లాల వారీగా ఆయకట్టు వివరాలను పేర్కొన్నారని, అవన్నీ తప్పులన్నారు. తాము ప్రాజెక్టును రద్దు చేస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదన్నారు. ప్రాజెక్టును రద్దు చేసే ముందు 9మంది కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులిచ్చి, వారి వివరణలు తీసుకున్నామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని కాంట్రాక్టర్ల ప్రయోజనాలను ఆశించి దాఖలు చేశారే తప్ప, ప్రజా ప్రయోజనాలను ఆశించి కాదన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు రద్దు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధం కాదన్నారు. ఉభయ రాష్ట్రాలకు నీటి పంపిణీ హక్కుల గురించి పిటిషనర్ మాట్లాడుతున్నారని, దీని ప్రకారం ఇది అంతర్రాష్ట్ర జల వివాదం అవుతుందని, అందువల్ల ఈ వ్యాజ్యా న్ని న్యాయస్థానాలు అధికరణ 226 కింద విచారించడానికి వీల్లేదన్నారు. వరదలప్పుడు 165 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికే ఈ ప్రాజెక్టు ఉద్దేశించిందని సుధాకర్ వివరించారు. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయాలనికోర్టును కోరారు. వ్యాజ్యాన్ని హైకోర్టు ఈ నెల 11న విచారించనున్నది. -
ఏడేళ్లు.. ఏడుసార్లు గడువు..
► రైతులకు తప్పని ఎదురుచూపులు ► అలంకారప్రాయంగా కొమురం భీమ్ ప్రాజెక్టు ► పూర్తికాని కాల్వల నిర్మాణం ► ఆరుతడి పంటలే దిక్కు ► వచ్చే ఏడాది ఖరీఫ్‌కూ నీళ్లు అనుమానమే ఆసిఫాబాద్ : జల్-జంగల్-జమీన్ అంటూ చివరి వరకూ గిరిజన సంక్షేమం కోసం పోరాడి అసువులు బాసిన యోధుడు.. అడవి బిడ్డల దైవం.. కొమురం భీమ్ పేర నిర్మించిన ప్రాజెక్టు ఏడేళ్లయినా నీళ్లందించడం లేదు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నా ఆయకట్టుకు అందని దుస్థితి నెలకొంది. రూ.450 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నవంబర్ 19, 2011న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఏడాదిలోగా అసంపూర్తిగా ఉన్న కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తిచేసి ప్రాజెక్టుకు అన్ని హంగులూ కల్పిస్తామని ఆ సమయంలో సీఎం కిరణ్ ప్రకటించారు. 2012 ఖరీఫ్ నాటికి 14 వేల ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. కానీ.. ఆయన మాటలు నీటి మూటలే అయ్యాయి. ఆయన హామీ ఇచ్చి మూడేళ్లయినా కాల్వల నిర్మాణమే పూర్తికాలేదు. గడువు మీద గడువు మాత్రం పెంచుతూనే ఉన్నారు. కొనసాగుతున్న గడువు పొడిగింపు ఆసిఫాబాద్ మండలంలోని అడ వద్ద నిర్మించిన కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా 44,500 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉంది. అయినా.. ఈ ప్రాజెక్టుతో రైతులకు ఒరిగిందేమీ లేకుండాపోయింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ప్రారంభించినా.. కాల్వలు నిర్మాణం నేటికీ పూర్తికావడం లేదు. మార్చి 20, 2007లోనే ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా.. నిధుల కొరత, అటవీశాఖ క్లియరెన్స్, పునరావాసం పనులు పూర్తి కాక ఇప్పటివరకు ఐదు సార్లు గడువు పొడిగించారు. ప్రాజెక్టును మొదట రూ.274.14 కోట్లతో 24,500 ఎకరాలకు సాగు నీరందించాలని పనులు ప్రారంభించారు. అనంతరం అదనంగా 21 వేల ఎకరాలకు సాగునీరందించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.170 కోట్ల నిధులు మంజూరు చేశారు. 22, జనవరి 2005లో రూ.274.14 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ మంజూరు కాగా, మార్చి 2006లో సాంకేతిక అనుమతి లభించింది. ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు పనులను నవయుగ కంపెనీ దక్కించుకుంది. 20 మార్చి, 2007లో ఈ పనులు పూర్తికావల్సి ఉంది. అయితే.. అటవీశాఖ అనుమతి, భూసేకరణ, పునరావాస పనుల్లో జాప్యంతో పూర్తి కాలేదు. దీంతో 31 మార్చి, 2009 వరకు గడువు పెంచారు. రెండో దఫా 31 ఆగస్టు, 2009 వరకు పెంచారు. మూడో దఫా డిసెంబర్, 2011 వరకు, నాల్గో దఫా 31, డిసెంబర్ 2011 వరకు పెంచారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో 30 జూన్, 2013కు ఐదోసారీ గడువు పెంచారు. ఆరోసారి 30, జూన్, 2014 వరకు పెంచారు. గడువులోగా పూర్తి కాకపోవడంతో ఏడో సారీ 30 జూన్, 2016కు పెంచారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి.. ప్రాజెక్టు ఎర్త్‌బండ్, ఎడమ హెడ్ రెగ్యులేటర్, 9 గేట్లు పూర్తయ్యాయి. 24వ కిలోమీటర్ నుంచి 54 కిలోమీటర్ వరకు ఐదు చోట్ల ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లో అటవీశాఖ క్లీయరెన్స్ రావల్సి ఉంది. కాల్వల నిర్మాణం పనులు అటవీ శాఖ అనుమతి లేక నిలిచిపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ.365 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇటీవల కుడి కాల్వ పనులు సైతం ప్రారంభించారు. పూర్తై ప్రధాన కాల్వ కింద 5వ డిస్ట్రిబ్యూటర్ వరకు పూర్తి చేసి కనీసం 10 వేల ఎకరాలకైనా సాగునీరందిస్తామని ప్రకటించిన అధికారులు చేతులెత్తేశారు. భూసేకరణే ప్రధాన సమస్య.. ప్రారంభం నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. ఏడేళ్లుగా అటవీ భూ సేకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నా జాప్యం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన 28 అంశాలను పూర్తి చేసి, కలెక్టర్ ఆమోదంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాల్‌మెంట్‌కు పంపించారు. రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేక ప్రాజెక్టు పనులు పూర్తికావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మందకొడిగా ‘పోలవరం’ పనులు
పోలవరం రూరల్, న్యూస్‌లైన్ : పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థారుులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు కాక వారు గ్రామాలను ఖాళీ చేయకపోవడంతో ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నారుు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మండలంలోని దేవరగొంది, మామిడిగొంది, తోటగొంది గ్రామాల్లో ట్విన్ టన్నెల్స్, పి.రెగ్యులేటర్, ఓటీ రెగ్యులేటర్, ఎఫ్ శాడిల్ డ్యామ్, ఈ శాడిల్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రధానంగా ఈ గ్రామాల నిర్వాసితులకు పూర్తిస్థాయి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేసి గ్రామాలను ఖాళీచేయిస్తే తప్పా పనులు వేగవంతం కావని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా ఇప్పటి వరకు ఈ.శాడిల్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. ట్విన్ టన్నెల్స్ తవ్వకం పనులు దాదాపు పూర్తికావచ్చారుు. మరో 30 మీటర్లు దేవరగొంది గ్రామ సమీపంలో తవ్వకం పనులు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ట్విన్ టన్నెల్స్ నిర్మాణం పనులకు సంబంధించి రూ.91 కోట్లు ఖర్చు అయినట్లు ప్రాజెక్టు డివిజన్-2 ఈఈ సయ్యద్ ఇలియా బాష తెలిపారు. టన్నెల్ లోపలి భాగంలో కాంక్రీట్ లైనింగ్ పనులకు కూడా అనుమతి వచ్చిందన్నారు. 64వ ప్యాకేజీలో భాగంగా మామిడిగొంది గ్రామం నుంచి తోటగొంది గ్రామం వరకు కుడి, ఎడమ టన్నెల్స్ 826 మీటర్లు తవ్వకం పనులు పూర్తయ్యాయి. 63వ ప్యాకేజీలో భాగంగా మామిడిగొంది గ్రామం నుంచి దేవరగొంది గ్రామం వరకు కుడి టన్నెల్ 757 మీటర్లు, ఎడమ టన్నెల్ 715 మీటర్లు తవ్వకం పనులు జరిగాయని, మరో 30 మీటర్లు టన్నెల్ తవ్వకం పనులు జరగాల్సి ఉందన్నారు. 64వ ప్యాకేజీ కింద మామిడిగొంది నుంచి తోటగొంది గ్రామాల మధ్య తవ్వకం పనులకు సంబంధించి రూ.73.899 కోట్లకు గానూ రూ. 51.767 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు అయిందని, అలాగే 63వ ప్యాకేజీ మామిడిగొంది గ్రామం నుంచి దేవరగొంది తవ్వకం పనులకు సంబంధించి రూ.72.81 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.39.748 కోట్లు ఖర్చు అయిందన్నారు. టన్నెల్స్ లోపలి భాగంలో లైనింగ్ పనులు పూర్తయ్యాక 90 సెంటీమీటర్లు కాంక్రీట్ పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. 62వ ప్యాకేజీలో చేపట్టిన పి.రెగ్యులేటర్, ఓటీ రెగ్యులేటర్, ఎఫ్ శాడిల్‌డ్యామ్ నిర్మాణ పనులకు సంబంధించి రూ.79 కోట్లకు గానూ రూ.61.269 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.