పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు వాస్తవమే: పోలీసులు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైన విషయాన్ని పోలీస్ ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వరరావు ధృవీకరించారు. ఐపీసీ 153-ఏ, 506 సెక్షన్ల ప్రకారం పవన్ కళ్యాణ్ పై నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లిలో కేసు నమోదు చేశారని ఇన్స్ పెక్టర్ తెలిపారు.
టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావుపై పవన్ కళ్యాణ్ అనుచిత, వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై రవి కుమార్ అనే అడ్వకేట్ స్థానిక కోర్టులో నమోదు చేశారు.
ఇటీవల వరంగల్ లో జరిగిన సభలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.