
అన్ని పార్టీల అంగీకారంతోనే కాంగ్రెస్ నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వండంటూ కేంద్రానికి 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చి విభజనకు పునాదులు వేసిన బాబు మరోసారి యూ టర్న్ తీసుకుంటున్నారని అన్నారు.
రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకరించటం వల్లే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు, యాత్రలు చేయటం సరికాదని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను ఎలా పెంచాలో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని బొత్స పేర్కొన్నారు.