చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో వికలాంగుల పింఛన్లకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర లురాని వారిని గుర్తించి వారికి పంచాయతీ సెక్రటరీల ద్వారా ప్రతినెలా పింఛన్ డ్రా చేసి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశిం చారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో పలువురు వికలాంగుల వేలిముద్రలు సరిపోవడం లేదని పింఛన్ ఇవ్వలేదని కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ వేలిముద్రలు సరిపోని వికలాంగులకు పింఛన్లు సంబంధిత సెక్రటరీలు సొంత బాధ్యత తీసుకుని అందించాలన్నారు. ప్రజావాణిలో సరిగా ఎదుగుదల లేని రమేష్ కుమార్తె గంగామాతకు గతంలో రిలీ జైన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.25వేలను వెంటనే చెల్లిం చాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మీ- సేవ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
జిల్లాలో మీ-సేవ ద్వారా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలకోసం వచ్చిన దరఖాస్తులు 33వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత ఆర్డీవోలు, తహశీల్దార్లు సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణిలో రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని, వీటి పరిష్కారానికి అనుభవం కలిగిన రెవెన్యూ అధికారులతో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జేసీ భరత్‌గుప్తా, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్ల పంపిణీ
Published Tue, Nov 11 2014 1:59 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement
Advertisement