సాక్షి, విజయవాడ : విజయవాడలోని ధర్నాచౌక్‌లో వెంకటాపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు.పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం కాలనీలో గత 20సంవత్సరాలుగా పోరంకి గ్రామస్తులు చెత్తను తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వెంకటాపురం కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. మా కాలనీ మొత్తాన్ని ఒక డంపింగ్ యార్డుగా తయారు చేసి ఇష్టం వచ్చినట్లుగా చెత్తను పారవేస్తున్నారు. మొత్తం 52 ఎకరాలు కలిగిన వెంకటాపురం కాలనీని కబ్జా చేసి అందులో 642 ఫ్లాట్లు నిర్మించాలని చూస్తున్నారు. 20 సంవత్సరాలుగా చెత్తను తొలిగించాలని గత ప్రభుత్వాలను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాకు విశ్వాసం ఉందని, కేవలం మా సమస్యలు పరిష్కరించాలనే నిరసన చేపట్టామని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి చేర్చాలని, మా కాలనీని స్వచ్చ వెంకటాపూర్‌గా తీర్చిదిద్దాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment