‘చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు’
నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్ సీపీ నేతలు అన్నారు. నెల్లూరు శెట్టిగుంట రోడ్డులో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో బుధవారం పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తుంటూ టీడీపీ నేతలు మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉదయం ఏడు గంటల నుంచే నేతలు గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టారు.