నాందేవ్‌వాడ,న్యూస్‌లైన్ :సమాజంలో రోజు రోజుకు తగ్గిపోతున్న మానవతా విలువలను పెంపొందించేందుకు, ఆదర్శ సమాజంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబా ద్రి కోరారు. సోమవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియం లో ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ‘ సహాయ స్వచ్ఛంద సంస్థ’ కార్యక్రమంలో భా గంగా మదర్‌థెరిసా జయంతి నిర్వహించారు. ఈ సం దర్భంగా పలువురు పేద, అనాథ పిల్లలకు వివిధ వస్తువులు, దుస్తులను ఉచితంగా అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి మాట్లాడుతూ పేద, అనాథ పిల్లలను ఆదుకునేందుకు కళాశాల విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు సేవ, సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మదర్‌థెరిసా ఆశయాలకు అనుగుణం గా నడుచుకోవాలన్నారు. సమాజం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడాని కి ప్రతి విద్యార్థి ముందడుగు వేయాలని అన్నారు. ఇతర విద్యార్థులను కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొ నే విధంగా చేయాలన్నారు. అనంతరం ఆర్‌ఐఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం చాలా బాగుందన్నారు. సమాజంలో విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేపడితే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు.
ప్రతి రోజు విద్యార్థులు దుబారా ఖర్చుపెడతారని, వాటిలో నుంచి ఒక్కరూపాయి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమన్నారు. ఒక్క రూపాయే కదా అని అనుకోవద్దని, వెయ్యిమంది విద్యార్థులు కలిస్తే కొన్ని వేల రూపాయలు అవుతాయని, అవి ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎంతో తోడ్పడుతాయన్నారు. అనంతరం డిచ్‌పల్లికి చెందిన అనాథ పిల్లలు అవినాష్, విజయ్‌లక దుస్తులు, నిజామాబాద్ మండలం సిర్‌పూర్ గ్రామానికి చెందిన నర్సయ్యకు కృత్రిమకాలు, నందిపేట మండలానికి చెందిన నిఖితకు దుస్తులు, గాయత్రికి ఫిజియోథెరఫి కిట్, నిఖిత్‌కు నెక్‌బెల్టులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సాంబశివరావు, కేర్ డిగ్రీ కళాశాల డెరైక్టర్ నరాల సుధాకర్, రెడ్‌క్రాస్ కార్యదర్శి రామకృష్ణాబుద్దిస్ట్, లక్ష్మణగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదర్శ సమాజం నిర్మించాలి..
Published Tue, Aug 27 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement
Advertisement