ఉద్యోగుల సమ్మెతో రోజుకు అర్టీసీకి రూ. 13 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. సీమాంధ్ర నిరసనలతో అర్టీసీకి రూ.98 కోట్ల నష్టం ఏర్పడిందన్నారు. తిరుమలలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అర్టీసీ సేవలను కొనసాగించాలని ఆయన అర్టీసీ యూనియన్లకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా యూపీఏ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో నిరసనలు మిన్నంటాయి.
ఆ నిర్ణయం వెలువడిన నాటి నుంచి వివిధ ప్రాంతంలో అర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయినాయి. అయితే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే తమ పదవులకు ఈ నెల 12లోగా రాజీనామాలు చేయాలని ఏపీఎన్జీఓ సంఘం డిమాండ్ చేసింది. లేని పక్షంలో 12 అర్థరాత్రి నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని ఏపీఎన్జీఓ సంఘం హెచ్చరించింది.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఏపీఎన్జీఓ సంఘం ప్రకటించింది. ఆ సంఘానికి అర్టీసీతోపాటు పలు సంఘాలు మద్దతు నిచ్చాయి. దాంతో తిరమలకు వెళ్లే అర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు అర్టీసి సిబ్బంది పేర్కొన్నారు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరపతిలో తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారు. దాంతో అర్టీసీ ఎండీపై విధంగా విజ్ఞప్తి చేశారు.