ఓ వ్యక్తి దారుణ హ త్యకు గురి కాగా అత ని భార్యపైనే మృతుడి సోదరుడు, గ్రామస్తు లు అనుమానం వ్య క్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం...
తాడూరు, న్యూస్‌లైన్: ఓ వ్యక్తి దారుణ హ త్యకు గురి కాగా అత ని భార్యపైనే మృతుడి సోదరుడు, గ్రామస్తు లు అనుమానం వ్య క్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం... తాడూరు మండలం పాపగల్‌కు చెందిన ఎల్లయ్య (32) కు సుమారు పదేళ్ల క్రితం కల్వకుర్తి మం డలం మార్చాల వాసి పద్మమ్మతో వివాహమైంది.
వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భర్త తమకున్న నాలుగెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవా రం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు నిద్రకు ఉపక్రమించారు. పది గంటలకు తన భర్తను ఎవరో గొంతు కోసి పరారయ్యారని భార్య కేకలు వేయగా చుట్టుపక్కల వారంతా వచ్చి అతడిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లా రు.
అక్కడే చికిత్స బుధవారం ఉదయం మృతి చెందాడు. ఇదిలాఉండగా మద్యా ని బానిసైన తన తమ్ముడు తరచూ భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడని మృతుడి అన్న బాలయ్యతోపాటు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ క్రమంలోనే ఆమె తమకున్న ఇద్దరు పిల్లలను తల్లిగారింటికి పంపించి పథకం ప్రకారం అతడిని హతమార్చిం దని వారు ఆరోపించారు. ఈ మేరకు నిందితురాలిని నాగర్‌కర్నూల్ సీఐ శేఖర్‌రెడ్డి అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం సంఘటన స్థలానికి జాగిలాన్ని రప్పించి విచారణ నిర్విహ ంచారు.