సాక్షి, తూర్పుగోదావరి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అమలాపురం ఆర్డీఓ కార్యలయం వద్ద తుపాన్ ప్రభావం పై సమీక్ష నిర్వహించారు. తుపాన్ జిల్లాలోనే తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉందని కానీ అది ఎక్కడ తీరం దాటుతుందో తెలియడం లేదని అన్నారు.
పెథాయ్ తుపాన్ గంటకుబ 90 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. తుపాన్ తీరం దాటే ప్రాంతం ఇవాళ సాయంత్రంలోగా తెలిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమలో ఇరవై ఏడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. తిత్లీ తుపాన్‌లో పని చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నాం. ప్రజలకు కావలిసిన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచ్చామని చెప్పారు. కమ్యూనికేషన్ నిలిచిపోకుండా సెల్ టవర్లు వద్ద జనరేటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని పాఠశాలలకు సోమ, మంగళవారం సెలవు దినాలుగా ప్రకటించారు. పెథాయ్ తుపాన్‌ను ఎదుర్కొవడానికి జిల్లాకు ఎన్డీఆర్‌ఫ్, ఎస్‌టీఆర్‌ఫ్ బృందాలు వచ్చాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.
కోనసీమలో 27 పునరావాస కేంద్రాల వివరాలు...
అమలాపురం నియోజకవర్గానికి సంబందించి అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలలో ఏడు పునరావాస కేంద్రాలలు. ఉప్పలగుప్తం మండలంలో వాసాలతిప్ప, చల్లపల్లి, ఎన్. కొత్తపల్లి, ఎస్. యానంలోని పాఠశాలలు. అలవంరం మండలంలో ఓడలరేవు సైక్లోన్ షెల్టర్లు సామంతకుర్రు సైక్లోన్ షెల్టర్లుతో పాటు కొమరిగిరిపట్నం సైక్లోన్ షెల్టర్లును ఏర్పాటు చేశారు.
ప.గో.జిల్లా : నిడదవోలులో పెథాయ్ తుఫాన్ నేపధ్యంలో నిడదవోలు తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు మండలంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన అప్రమత్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల వి.ఆర్.ఓలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు తమ ధాన్యాలను, భద్ర పరచుకోవలని, పాడుబడిన ఇళ్లలో, పూరి గుడిసెల్లో ఉండరాదని దీని పై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
తుపాన్ ప్రభావం పై గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ఆరా..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం పెథాయ్ తుపాన్ ప్రభావం పై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్. ఎల్. నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పోన్ చేసి ముందస్తు చర్యలపై ఆరా తీశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టం, ఆస్థినష్టం వాటిలకుండా చర్యలు తీసుకొవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment