
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి రమేష్ (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజక ఇన్‌ఛార్జి జోగి రమేష్‌పై కక్షసాధింపు చర్య కొనసాగుతోంది. ఎస్‌ఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఏపీ బంద్ సందర్భంగా (శుక్రవారం) జోగి రమేష్ తనతో అసభ్యకరమైన పదజాదంలో మాట్లాడారంటూ ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ టి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐ పవన్ కిషోర్ శనివారం కేసు నమోదు చేశారు. గతంలోనూ జోగి రమేష్‌ను తప్పుడు కేసులో ఇరికించేందుకు విఫలయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా బంద్ నేపథ్యంలో జోగి రమేష్ పరుష పదజాలం ఉపయోగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా జోగి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కొండపల్లి-ఇబ్రహీంపట్నం గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న కట్టె రాములు అనే ప్రయాణికుడు గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు పాదయాత్ర కారణంగానే రాములు మరణించాడని హల్‌చల్ చేసి జోగి రమేష్‌పై కేసు నమోదుకు యత్నించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment