అమరవీరుల త్యాగాలు మరువలేనివి | police martyrs services | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Published Tue, Oct 22 2013 2:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

police martyrs services

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : దేశ సరిహద్దుల్లో, సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ఆర్థిక శాఖ మం త్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నా రు. వారి ఆశయసాధనకు అంద రం సమష్టిగా కృషిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లు యుద్ధం వచ్చినపుడే పోరాడుతారని, పోలీసులు సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రతి నిత్యం పోరాడుతూనే ఉంటారన్నారు. పోలీసు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. 
 
 విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి నుంచి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారం, రాయితీని పెంచామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ నూతన భవనం, పోలీసుస్టేషన్లు, పోలీ సు సిబ్బంది క్వార్టర్లను నిర్మించేందు కు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు దూరంగా ఉం టూ సమాజంలో మెరుగైన శాంతి, భద్రతలను ప్రజలకందించడమే అమరులకిచ్చే నిజమైన నివాళి అన్నారు. జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ ఐఆర్‌ఎస్ మూర్తి విధి నిర్వహణలో ఈ ఏడాది మృతి చెందిన అమరవీరుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు అధికారులు పూలమాలలు వేశారు.  
 
 నివాళులు 
 పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపానికి మంత్రి ఆనంతో పాటు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, ఎంఎల్‌సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు నగర, వెంకటగిరి, కావలి ఎమ్మెల్యేలు శ్రీధరకృష్ణారెడ్డి, రామకృష్ణ, మస్తానరావు, పోలీసు అధికారులు నివాళులర్పిం చారు. అనంతరం అమరవీరుల స్మృ త్యర్థం స్మృతి పరేడ్ నిర్వహించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీవిగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిం చారు.   
 
 బహుమతుల ప్రదానం 
 అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి, కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. 
 
  300: అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి  
 302: సభలో మాట్లాడుతున్న ఎస్పీ
 303: అమరవీరులకు నివాళి అర్పిస్తున్న పోలీసు సిబ్బంది
 304:  మంత్రి చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్న ఆర్‌ఐ శ్రీనివాసరావు, 
 305: జోరు వానలో ర్యాలీ నిర్వహిస్తున్న పోసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement