అనంతపురం: అనంతపురంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఓబులదేవరచెరువు మండలం మల్లాపల్లికి చెందిన నలుగురు వైఎస్సాసీపీ కార్యకర్తలను ఓ చోరీ కేసులో విచారణ పేరుతో మూడు రోజుల క్రిత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రమేశ్ నాయక్, హారూం భాషా, పకీర్ నాయక్, బాబా నాయక్‌లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతోనే నేరం ఒప్పుకోవాలని తీవ్రంగా కొట్టారు.
రోజూ విచారణ పేరుతో వేధింపులు సాగిస్తున్నారని హరూం భాషా, పకీర్ భాషా అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తల భార్యలు ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు చూసి వారిని కదిరిలోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మల్లాపల్లి గ్రామంలో ఉన్న రాజకీయ కక్షల నేపథ్యంలోనే వేధింపులు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు తీసుకెళ్లిన వారిపై ఇంతవరకు ఎలాంటి నేరారోపణలు లేవని మల్లాపల్లి గ్రామస్తులు తెలిపారు.
(ఓబులదేవరచెరువు)