ఉత్తర్వులు అందాయి.. విధుల్లోకి చేర్చుకోండి | power employees to join in duty after orders | Sakshi
Sakshi News home page

ఉత్తర్వులు అందాయి.. విధుల్లోకి చేర్చుకోండి

Published Mon, Jun 15 2015 10:08 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

power employees to join in duty after orders

హైదరాబాద్ సిటీ: ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. కోర్టు తీర్పు అధికారిక ప్రతి సోమవారం సాయంత్రం వారి చేతికొచ్చింది. దీని ఆధారంగా ఇటీవల రిలీవ్ చేసిన 1,452 మంది ఉద్యోగులను తక్షణమే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తాజాగా టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీకి లేఖ రాశారు. కోర్టు తీర్పు ప్రతిని దీనికి జత చేశారు. స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏపీకి చెందిన విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసింది.

దీనిపై ఉద్యోగులు కోర్టులో సవాల్ చేశారు. వారికి అనుకూలంగా శుక్రవారమే తీర్పు వెలువడినప్పటికీ, ఉత్తర్వు ప్రతి అందలేదు. ఇదే విషయాన్ని టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ ఏపీ ట్రాన్స్‌కోకు తెలిపారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందడంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నేతృత్వంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement