వేళాపాళ లేదు
- అడ్డగోలు విద్యుత్ కోతలతో ప్రజా జీవనం అతలాకుతలం
- వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి
- మంచినీటికి తప్పని ఇబ్బందులు
- ఆసుపత్రుల్లో నరకం అనుభవిస్తున్న రోగులు
ఏలూరు: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ఇష్టారాజ్యంగా విధిస్తున్న విద్యుత్ కోతలు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోజుకు 10 నుంచి 12 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో ప్రజలు నిద్రకు దూరం అవుతున్నారు. కనీసం కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నా అవకాశం లేనంతగా అధికారులు ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లాకు రోజుకు 13.50 మిలి యన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, కేవలం 9 మిలి యన్ యూనిట్లు మాత్రమే గ్రిడ్ నుంచి లభిస్తోంది. ఈ కారణంగా వేళాపాళ లేకుండా భారీఎత్తున కోతలు విధిస్తున్నారు. మరోవైపు లో-ఓల్టేజీ కారణంగా సరఫరా ఉండే సమయంలోనూ ఫ్యాన్లు మొరారుస్తున్నారు.
వేసవిలో సాధారణమే అరునా...
వేసవిలో విద్యుత్ కోతలు విధించడం సర్వసాధారణమే. అరుుతే, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మన జిల్లాలో వేళాపాళ లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడం ప్రజలను తీవ్ర అవస్థలకు గురి చేస్తోంది. ఎండలు తీవ్రరూపం దాల్చడం.. గోరుచుట్టపై రోకలి పోటులా విద్యుత్ కోతలు పెరగడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరు నుంచే అప్రకటిత విద్యుత్ కోతలు అమల్లోకి వచ్చాయి. తొలుత రెండు గంటలనుంచి ప్రారంభమైన కోతల సమయం పెరుగుతూ వచ్చింది. పట్టణాల్లో 10 గంటలు, పల్లెల్లో 12 గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. నిర్ధిష్టమైన వేళలు ప్రకటించి.. ఆ ప్రకారం విద్యుత్ కోతలు విధిస్తే ప్రజలు అందుకు అనుగుణంగా పనులు చేసుకుని, విశ్రాంతి తీసుకునే అవకాశం ప్రజలకు కలుగుతుంది.
జిల్లాలో ఎక్కడా వేళలను పాటించకపోవడంతో జనం పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. గృహిణులు, వృద్ధులు, పిల్లల పరిస్థితి అరుుతే మరీ దారుణంగా ఉంటోంది. ఉదయూన్నే వంటచేసి పిల్లలకు క్యారేజీలు సర్దుదామంటే కరెంటు ఉండట్లేదు. ఇక వృద్ధులు, పిల్లలు పడే బాధలు చెప్పనలవి కాదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా నాలుగు పూటలా ఇష్టమొచ్చినట్టు కోతలు విధిస్తుండటంతో వడగాలుల బారినపడుతున్నారు. ఒళ్లంతా ఉడికిపోరుు చెమట పొక్కులు రావడంతో అవస్థలు పడుతున్నారు.
మంచినీటికీ కష్టమే
విద్యుత్ కోతల వల్ల గ్రామాలు, పట్టణాలనే భేదం లేకుండా ఎవరికీ మంచినీరు పూర్తిస్థారుులో అందని పరిస్థితి నెలకొంది. పట్టణాల్లో ఉదయం 7 గంటల తర్వాత, సాయంత్రం 5 గంటల తర్వాత మొత్తంగా రెండు గంటల చొప్పున మంచినీటి సరఫరా అవుతుంటుంది. ఆ సమయంలో నీటిని పట్టుకోకపోతే ఇక రోజంతా నీరు దొరకదు. విద్యుత్ కోతల వల్ల ఆ సమయూల్లో నీటి సరఫరా ఇబ్బంది అవుతోంది. వేసవిలో తలెత్తే నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఇళ్లలో మోటార్ బోర్లు వాడటం పరిపాటి. కోతల కారణంగా మోటార్ల సాయంతో నీటిని తోడుకునే అవకాశం లేకపోతోంది.
రోగులకు నరకమే..
ప్రభుత్వాసుపత్రులలో రోగులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. అంతంతమాత్రంగా ఉన్న వసతులకు తోడు ఫ్యాన్లు తిరగకపోవడంతో రాత్రి వేళల్లోనూ వార్డుల్లో జాగరం చేస్తున్నారు. శస్త్రచికి త్సలు చేయించుకున్న మహిళలు, వృద్ధులు, పిల్లలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నారుు. అన్ని వార్డులకు జనరేటర్ సదుపాయం లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పీహెచ్‌సీల్లోనూ విద్యుత్ కోతలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. వ్యాక్సిన్‌లు, విటమిన్ సిరప్‌లను నిల్వ చేయలేక సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.