'పుష్కరస్నానంతో ఈశ్వరకటాక్షం'
అనుష్టాన కేంద్రాన్ని సందర్శించిన విజయేంద్ర సరస్వతి
ఆత్రేయపురం : పుష్కర స్నానంతో ఈశ్వర కటాక్షం లభిస్తుందని కంచి కోమకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అన్నారు. మండల కేంద్రం ఆత్రేయపురం శివారు ఆగ్రహరంలో శనివారం రాత్రి అనంత విభూషిత చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుష్టాన కేంద్రాన్ని కంచికామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి సందర్శించి భక్తులకు ప్రవచనాలు చేశారు. గోదావరి తీరంలో శాస్త్రోత్తంగా పుష్కరస్నానం అచరిస్తే ఈశ్వర కటాక్షం లభిస్తుందన్నారు.
హిందూ ధర్మ ప్రకారం పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు ఆచరించడం ద్వారా శ్రేయస్కరమన్నారు. గోదావరిలో స్నానం ఆచరించడం ద్వారా ఏడేడు జన్మల పుణ్య ఫలాలు లభిస్తాయన్నారు. విజయేంద్ర సరస్వతికి నిర్వాహకులు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎస్.జానకిరామయ్య, ఎ.ప్రభాకర్‌రావు, శ్రీపాద గణేష్ శర్మ, ట్రెజరర్ సీహెచ్ రాధాకృష్ణ, సెక్రటరీ బీహెచ్ సత్యనారాయణ, మెంబర్లు ఐ.పద్మావతి, సిహెచ్ సత్యమూర్తి, చందు, మాధవరావు పాల్గొన్నారు.