జనాభాపరంగా అధికంగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని స్వయంగా బీసీ నేత అయిన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని కోరామని ఆయన చెప్పారు. పార్క్ హయత్ హోటల్లో బస చేసిన మోడీని ఆర్. కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వివిధ పథకాల గురించి మోడీకి వివరించామని ఆర్.కృష్ణయ్య తెలిపారు. వాటిని తమ రాష్ట్రంలో అమలయ్యేలా చూస్తానని నరేంద్రమోడీ చెప్పారన్నారు. ఇప్పటికి 200కుపైగా బీసీ కులాలు పార్లమెంట్‌లో అడుగుపెట్టలేదన్నారు.
ఎస్సీ వర్గీకరణకు తోడ్పడాలని నరేంద్రమోడీని కోరినట్టు మందకృష్ణ మాదిగ చెప్పారు. అణగారిన వర్గాలకు చేయూతనిచ్చేలా కేంద్రంలో కృషి చేయాలని కోరామన్నారు. ఆరోగ్యశ్రీ హృద్రోగులకు వర్తిస్తే బాగుంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశామన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మోడీ తెలిపారన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయకుండా యూపీఏ సర్కారు వెనకడుగు వేస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 100రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని మోడీ హామీయిచ్చారని బెల్లయ్య నాయక్ వెల్లడించారు.
మోడీని కలిసిన ఆర్. కృష్ణయ్య, మందకృష్ణ
Published Sun, Aug 11 2013 1:24 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement