నిజాంసాగర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత రబీ పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు విపరీత ంగా పెరిగాయి. వర్షాకాలం చివరి వరకు కురిసిన వానలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, జలాశయాలలో పుష్కలంగా నీరు చేరింది. ఖరీఫ్ కన్నా రబీ సాగు విస్తీర్ణం పెరుగుతున్నా, పెట్టుబడులూ రెట్టింపుగానే ఉన్నాయని రైతులు వాపోతు న్నారు.
ముఖ్యంగా వరి సాగును ఎంచుకున్న రైతులు పెట్టుబడులకు తిప్పలు పడుతున్నారు. విత్తన ఎంపిక మొదలు నారుమడి నుంచి పంట నూర్పిడి వరకు పొలాలను రైతులు కంటికి రెప్పలా చూసుకోవాల్సి వస్తోంది. ముడి చమురు ధరలు పెరగడంతో మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆ ప్రభావం రైతులపైనా పడింది. ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ కూలీల ధరలు రెట్టింపయ్యాయి. కాంప్లెక్స్, యూరియా ధరలు పెరిగాయి. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు చేసిన మహిళా కూలీలకు రూ. 100 నుంచి రూ.110 చెల్లించారు. ఈ రబీ సాగులో కూలీలకు రూ. 130 నుంచి రూ. 150 వర కు చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొం టున్నారు.
అంతేకాకుండా ఎకరం పొలా న్ని దమ్ముచేసే ట్రాక్టర్‌కు ఖరీఫ్‌లో రూ. 1300 చెల్లించగా ప్రసుత్తం రబీలో రూ. 1600 వరకు ట్రాక్టర్ల యజమానులు పెం చారు. ఇలా ఈ రబీ సీజన్‌లో పంటల సాగు ధరలు పెరగడంతో సన్నకారు రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఎకరం పొలానికి రైతులు రూ. 20 వేలకు పైగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఆరు నెలలకు చేతికొచ్చే పంటలకు రేయిం బవళ్లు కష్టపడినా రూ. 30 వేలకు మించి దిగుబడి రావడం లేదంటున్నారు.
‘మద్దతు’ కరువు
వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతు లు వాపోతున్నారు. వరి ధాన్యానికి క్విం టాలుకు రూ. 1,500 నుంచి రూ. 1,800 మద్దతు ధరను చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
సాగు భారమే
Published Wed, Jan 29 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement