పెద్దేముల్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన పెద్దేముల్‌లోని ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన మూడో విడత రచ్చబండలో పాల్గొని మాట్లాడారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండకు శ్రీకారం చుట్టారని, దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రచ్చబండ ద్వారా జిల్లాలో 40,353 ఇందిరమ్మ ఇళ్లు, 10,567 రేషన్ కార్డులు మంజురు చేసినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేసి రూ.12వేల కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికి వికారాబాద్ నియోజకవర్గానికి రూ.18కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు.
గతంలో పంట నష్టపోయిన రైతులకు రుణాలు ఇచ్చేందుకు రూ.ఏడు కోట్లు సిద్ధంగా ఉన్నాయని, తుపానుకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఉపాధి పీడీ చంద్రకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ధారాసింగ్, అనంత్‌రెడ్డి, మాజీ మున్సిఫల్ చైర్మన్ విశ్వనాథంగౌడ్, మండల ప్రత్యేకాధికారి సంధ్యారాణి, ఎంపీడీఓ సంధ్య, తహసీల్దార్ రామహరిప్రసాద్, గ్రామ సర్పంచ్ పద్మ, పలు పార్టీల నాయకులు అంజయ్య, నారాయణరెడ్డి, రాములు, మైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌చారి, చందర్‌నాయక్, విష్ణువర్ధన్‌రెడ్డి, అంబరయ్య, రియాజ్, వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ రచ్చబండ: ప్రసాద్‌కుమార్
Published Tue, Nov 26 2013 4:58 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement