![జూనియర్ల బట్టలు విప్పించి ర్యాగింగ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71413097017_625x300.jpg.webp?itok=3mc8lEJ0)
జూనియర్ల బట్టలు విప్పించి ర్యాగింగ్
అనంతపురం: అనంతపురం నగరంలోని మెడికిల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరోసారి జడలు విప్పింది. కాలేజీలోని జూనియర్లపై గత అర్థరాత్రి సీనియర్ విద్యార్థులు హద్దు మీరి ప్రవర్తించారు. దుస్తులు విప్పి డాన్స్లు చేయాలని జూనియర్లను ఆదేశించారు. అందుకు వారి నిరాకరించారు. మాకే ఎదురు చెబుతారా అంటూ జూనియర్లపై దాడి చేసి.... బలవంతంగా వారి చేత దుస్తులు విప్పించారు. అనంతరం వారితో అసభ్యకరమైన నృత్యాలు చేయించారు. బాధిత విద్యార్థులు సహాచర విద్యార్థులకు ర్యాగింగ్పై సమాచారం అందించారు.
దాంతో జూనియర్ విద్యార్థులంతా కలసి ర్యాగింగ్ చేసిన నలుగురు సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ర్యాగింగ్పై మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై... సీనియర్ విద్యార్థులను పిలిపించి మాట్లాడుతున్నారు. కానీ ర్యాగింగ్పై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.