నేడు ఉత్తరాంధ్రలో రాహుల్ పర్యటన | Rahul's visit today in northern | Sakshi
Sakshi News home page

నేడు ఉత్తరాంధ్రలో రాహుల్ పర్యటన

Published Sun, Oct 19 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

నేడు ఉత్తరాంధ్రలో  రాహుల్ పర్యటన

నేడు ఉత్తరాంధ్రలో రాహుల్ పర్యటన

విశాఖపట్నం: ఏఐసీసీ ఉపాధ్యక్షు డు రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరాం ధ్రలోని తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో పర్యటించనున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. శనివారం విశాఖపట్నంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్సాసత్యనారాయణలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్న రాహుల్ ఆదివారం ఉదయం 11.30గంటలకు స్టీల్‌ప్లాంట్, 12.30 గంట లకు తాటిచెట్లపాలెంలో బాధితులను పరామర్శించి 1.45గంటలకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడం, 2.15 గంటలకు పెదకవలవాడల, సాయంత్రం 4.45కు విశాఖ సిటీలోని ఏడుగుళ్ల పాలెం, 5.30 గంటలకు టర్నర్ చౌల్ట్రీ ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. రాత్రి ఏడుగంటలకు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష సాయం చేస్తారని వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement