ఐషర్ బోల్తా - గాయపడ్డ రైల్వే సిబ్బంది | railway workers injured in a Road accident | Sakshi
Sakshi News home page

ఐషర్ బోల్తా - గాయపడ్డ రైల్వే సిబ్బంది

Published Wed, Dec 30 2015 12:46 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

railway workers injured in a Road accident

అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. వేములపాడు వద్ద రైలు మార్గం పనులు చేయటానికి ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో వెళ్తున్న ఐషర్ వాహనం ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో వాహనంలో ఉన్న 15 మందిలో ఐదుగురు తీవ్రంగాను, 10 మంది స్వల్పంగాను గాయపడ్డారు. క్షతగాత్రులను గుత్తి ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం గుంతకల్లులోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement