నేడు రాజ్‌నాథ్ రాక | Rajnath Singh to attend RSS meet in Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు రాజ్‌నాథ్ రాక

Published Thu, Jan 9 2014 12:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

నేడు రాజ్‌నాథ్ రాక - Sakshi

నేడు రాజ్‌నాథ్ రాక

కీసర, న్యూస్‌లైన్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం జిల్లాకు రానున్నారు. కీసర మండ లం తిమ్మాయిపల్లి సమీపంలో గల ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, పార్టీ వర్గాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాయి. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, విశ్వహిం దూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కూడా పాల్గొననున్నట్టు సమాచారం. వీరంతా బుధవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 9 గంట ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఈ నెల 12 వరకు సమావేశాలను కొనసాగిస్తారని తెలిసింది. రాజ్‌నాథ్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం డాగ్‌స్వ్కాడ్‌తో ఫామ్‌హౌస్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement