రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారందరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు
Published Mon, Aug 7 2017 11:13 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM
అమరావతి : రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారందరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఉండవల్లిలోని తన నివాసంలో రాఖీ కట్టిన మహిళలను సీఎం అభినందించారు. చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాత, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అనూరాధ, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ సతీమణి రజనీ, బ్రహ్మకుమారీలు, తెలుగుపార్టీ మహిళా నాయకురాళ్లు పి. వెంకటలక్ష్మి, వి. రాణి, హేమలత, పద్మావతి, ఐ. అరుణ, మంజూషలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Advertisement