తొలివిడతలోనే.. | Ready for elections in nizamabad district | Sakshi
Sakshi News home page

తొలివిడతలోనే..

Published Thu, Mar 6 2014 3:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

Ready for elections in nizamabad district

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. జిల్లాలో రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 30న ఎన్నిక లు జరగనున్నాయి. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మొదటి విడతలోనే జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి.
 
 వచ్చే నెల 2న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 9 వరకు చివరి తేదీ కాగా, నామినేషన్ల పరిశీలన 10న ముగుస్తుంది. వివిధ రాష్ట్రాలలో పోలింగ్ ముగిసిన తర్వాత మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, ఓటముల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా వుండగా... కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. తాజాగా బుధవారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల సందడి పెరిగింది.
 
 రూ.దేళ్లలో పెరిగిన ఓటర్లు 1,78,966..
 2,005కు చేరిన పోలింగ్‌స్టేషన్లు..
 రూ.దేళ్లలో జిల్లాలో 1,78,966 ఓటర్లు పెరిగారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2009 ఎన్నికల నాటికి 16,25,799 ఓటర్లున్నారు. రూ.దేళ్లలో ఓటర్ల చేర్పులు, మార్పుల అనంతరం ఈ ఏడాది జనవరి 31న అధికారులు ప్రకటించిన గణాంకాల ప్రకారం ఓటర్ల సంఖ్య 18,05,765కు చేరింది. ఈ సారి కూడా జిల్లా ఓటర్లలో పురుషుల కంటె మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 18,05,765  ఓటర్లలో 8,72,753 మంది పురుషులుంటే.. 9,31,911 మంది మహిళా ఓటర్లున్నారు. 101 మంది ఇతరులు (హిజ్రా)లు ఈ సారి తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 2009లో పోలింగ్‌స్టేషన్ల సంఖ్య 1,929 కాగా, ఈ సారి 2,005కు చేరింది. అయితే రాష్ట్రంలో అతి తక్కువ పోలింగ్‌స్టేషన్లు ఉన్న జిల్లా కూడ మనదే.
 
 రెండు ఎన్నికల్లో నోటిఫికేషన్ తేదీల మార్పు...
 ఫలితాలు మాత్రం ఒకే రోజు....
 2009 సార్వత్రిక ఎన్నికలతో 2014 ఎన్నికల షెడ్యూల్‌ను పోలిస్తే తేదీలు అటు ఇటుగా ఉండగా... ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజు జరగనుంది. 2009లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 2న విడుదల చేస్తే, ఈ సారి 5న ప్రకటించారు. 2009లో నోటిఫికేషన్ మార్చి 23న జారీ కాగా ఈ సారి 10 రోజుల ఆలస్యంగా ఏప్రిల్ 2న జారీ చేయనున్నారు. ఇదే తరహాలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తేదీల్లోను కొంత తేడా ఉండగా, గత ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 16న జరిగితే... ఈ సారి ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. అయితే 2009, 2014 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మే 16నే జరగనుండటం చర్చనీయాంశం అవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement