ఆ ప్రభావం విభజనపై ఉండదు: బొత్స | Rebel MPs expelled no effect on Telangana Bill, says Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

ఆ ప్రభావం విభజనపై ఉండదు: బొత్స

Published Tue, Feb 11 2014 2:38 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఆ ప్రభావం విభజనపై ఉండదు: బొత్స - Sakshi

ఆ ప్రభావం విభజనపై ఉండదు: బొత్స

హైదరాబాద్: తిరుగుబాటు ఎంపీల బహిష్కరణకు విభజన బిల్లుకు సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన ప్రక్రియపై ఎంపీల బహిష్కరణ ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. ఆరుగురు పార్టీ ఎంపీలను బహిష్కరించినట్టు పీసీసీకి ఏఐసీసీ నుంచి సమాచారం అందిందని తెలిపారు. విభజనపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాంతాలవారీగా వ్యవహరించినట్లుగానే
పార్లమెంట్‌లో ఎంపీలు కూడా వ్యవహరిస్తారని చెప్పారు.

విభజన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకరనడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ను వీడాలనుకునే వారే ఇలా అభ్యర్థులు దొరకరని ప్రచారం చేస్తున్నారని బొత్స అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement