హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లింగ్ను ఉక్కుపాదంతో అణిచివేయాలని తెలుగుదేశం ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగలరాయుడు సూచించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎర్రచందనం స్మగ్లింగ్ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చెంగలరాయుడు మాట్లాడుతూ... ఎర్రచందనం స్మగ్లింగ్ర ప్రధానంగా అటవీ, పోలీసు శాఖలలోని కొందరి అధికారుల ప్రోద్బలంతోనే జరుగుతుందని ఆరోపించారు.
స్మగ్లింగ్ను అరికట్టాలంటే అటవీ, పోలీసు చట్టాలను కఠినతరం చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. కేవలంలో అధికారుల తనిఖీలలో రూ. 30 వేల కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుబడిందని చెంగలరాయుడు గుర్తు చేశారు.