తాళ్లపూడి : పార్టీలతో సంబంధం లేకుండా కాపులందరికీ రుణాలను అందించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డెరైక్టర్ యర్రా నవీన్ అన్నారు. మండలంలోని తాడిపూడిలో శనివారం ఆయన కాపు సంఘం నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఈనెల 20తో గడువు ముగుస్తుందన్నారు.
రుణాలు తీసుకున్న అనంతరం వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతమవ్వాలని ఆయన సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా కొత్తగా ముగ్గురు సభ్యులు, ఎంపీడీవోతో కలిసి కమిటీలు వేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో నవీన్‌ను కాపు సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. మండల కాపు సంఘం అధ్యక్షుడు నామా సూర్యప్రకాశం, కాపు సంఘం నాయకులు ఎం.సూర్యచంద్రరావు, ఎం.శ్రీనివాసరావు, శీర్ల సూర్యచంద్రం, శీలం రామచంద్రరావు, వంబోలు పోసిబాబు పాల్గొన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా రుణాలు
Published Sun, Feb 14 2016 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM
Advertisement
Advertisement