సాక్షి, గుంటూరు: అర్ధరాత్రి సంగతి అటుం చితే పగలు కూడా మహిళలు ఒంటరిగా తిరిగేందుకు భయపడుతున్నారు. కొందరు మృగాళ్లు చేస్తున్న అకృత్యాలే దీనికి కారణం. వయసు, వరసలు కూడా మరిచిపోయి, సమాజంలో ఉంటున్నామనే స్పృహ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొందరు కామాంధుల చేష్టలతో సభ్యసమాజం తలదించుకుంటోంది. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తెచ్చినప్పటికీ అవి రాజకీయ, ఆర్థిక, అంగ బలానికి దాసోహమంటున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లకు చిన్నారులు, బాలికలు అనే కనికరం లేదు. చేసిన దుర్మార్గం బయటకు రాకుండా వారిని హతమార్చేందుకు సైతం వెనకాడటం లేదు. వీరు తాము చేసే కీచక చేష్టలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం మరింత బాధాకరం. ఇలాంటి దారుణ పరిస్థితులు జిల్లాలోనూ ఉండడం దురదృష్టకరం.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘నిర్భయ’ చట్టం కాగితాలకే పరిమితమవుతోంది. ఈ చట్టం వచ్చిన తరువాత కూడా జిల్లాలో మహిళలు, చిన్నారులపై మరిన్ని అకృత్యాలు జరగడం విషాదకరం. తాజాగా యడ్లపాడుకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు కామంధులు లైంగికి దాడికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
బహిర్భూమికి వెళ్లిన మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశారు. ఆపై సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాట్సాప్ ద్వారా గ్రామంలోని యువకులకు పంపి పైశాచిక ఆనందం పొందారు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరిం పులకు దిగారు. వీరి ఆగడాలను తట్టుకోలేక గురువారం యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా జిల్లాలో జరుగుతున్న అకృత్యాలు అన్నీఇన్నీ కావు. గత ఏడాది నవంబర్‌లో శావల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా మారిందనే కోపంతో నాలుగేళ్ల చిన్నారిపై సొంత బాబాయే లైంగిక దాడి చేసి, హతమార్చాడు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా ఉన్న ఈ ఘటనరాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అడిషనల్ డీజీపీ ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ నిర్వహించారు. అనంతరం తల్లితోపాటు బాబాయినీ అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. గత నెల 9న బాపట్ల పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ముండ్ర ప్రత్యూష(19)ను ఆమె తల్లితో సహజీవనం చేసే మారుతండ్రే లైంగిక దాడి చేసి, చంపేశాడు.
ఒంటరిగా ఉన్న విద్యార్థికి కట్టెలు ఏరుకు వద్దామంటూ మాయమాటలు చెప్పి మార్కెట్ యార్డు ఆవరణలో ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. నోట్లో గుడ్డలు కుక్కి లైంగికదాడి చేసి హతమార్చాడు. గుంటూరు రూరల్ సీసీఎస్ డీఎస్పీ సుధాకర్ కేసును ఛేదించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన తాడేపల్లి పట్టణం డల్లాస్‌నగర్‌లో ఈ నెల 14న జరిగింది. కూతురు వయసుండే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ మృగాడిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు.
మనిషే..పశువై
Published Fri, Feb 20 2015 2:39 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement