మహిళా చైతన్యానికి ఆకాశమే హద్దుగా ఉంటోంది. అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి, అత్యున్నతస్థాయి విశ్వవిద్యాలయాల వరకు మహిళలు తమ సమ స్యలపై ఎన్నడూ లేనంత అధికంగా ప్రస్తుతం వీధు ల్లోకి వస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో దేశ వ్యాప్తంగా అనేకమంది మహిళలు అరెస్టులకు గురై పోలీస్‌స్టేష న్లలో గడపాల్సి వస్తోంది. నిర్బంధానికి గురైనప్పుడు పోలీసుస్టేషన్లలో దుర్భర పరిస్థితులకు గురవుతు న్నారు. ముఖ్యంగా మహిళల శుభ్రతకు సంబంధించి పోలీస్‌స్టేషన్లలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
ఈ నేపథ్యంలో కస్టడీలో ఉన్న మహిళల ప్రకృతి సహజ ఇబ్బందుల పట్ల పోలీసుశాఖ సున్నితంగా స్పందించాలంటూ అవసరాన్ని ఎత్తిపడుతూ ఎన్‌ఎస్ యూఐ జాతీయ కార్యదర్శి ఏంజెలికా అరిబామ్ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఇటీవల రాసిన ఒక ఉత్తరంపై తగిన చర్చ జరగలేదు. దీనిపై మహిళా సంఘాలు కూడా తగినంత దృష్టి పెట్టలేదనిపిస్తోంది. కస్టడీలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అవసరాల విష యంలో ఏ పోలీసు స్టేషన్ కూడా కాస్త మానవీయం గా ప్రదర్శించిన దాఖలాలు కనిపించడం లేదని ఏంజెలికా అరిబామ్ ఉత్తరం చాటి చెప్పింది. కస్టడీ లో ఉన్నప్పుడు మహిళలకు నాప్‌కిన్లు అందుబాటు లో లేకపోవడం వల్ల తీవ్రసమస్యలకు గురవుతున్నా రని ఆ లేఖ తెలిపింది.
ప్రకృతి సహజమైన రుతుస్రావం మహిళలకు చెప్పి రాదన్నది తెలిసిందే. కస్టడీలో ఉన్నప్పుడు మహిళలకు అలాంటి పరిస్థితి ఎదురైతే నోరు విడిచి చెప్పుకోవడం ఒక సమస్య కాగా, అలా తమ సమస్య గురించి వారు చెప్పుకున్న సందర్భంలో కూడా వారికి సహాయం అందడం లేదు. అలాంటి సమస్య గురించి బయటకు చెప్పడమే పాపమన్నట్లుగా భావి స్తున్న మహిళా పోలీసులు సైతం.. నాప్‌కిన్లు, ప్యాడ్ లు వంటివి ఇక్కడ దొరకవు అంటూ హేళన చేయడం మరింత ఇబ్బందికరంగా తయారైందని అరిబామ్ వాపోయారు. ఆరుగంటల వరకు మహిళలను కస్టడీ లో ఉంచే పరిస్థితుల్లో ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ వారికి నాప్‌కిన్లు అందుబాటులో ఉంచితీరాలి. ఇక నీళ్లు కూడా లేని స్టేషన్లు ఉంటున్నాయం టే అది ఎంత ఇబ్బందికరమో స్పష్టమే.
ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్లలో ఉన్న పురుష, మహిళా పోలీసులను ఈ సమస్యపై సున్నితంగా వ్యవహరించే లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. కస్టడీలోని మహిళలకు కనీస వసతులు కల్పించడం అత్యవసరం. పీరియడ్స్ రావడం అనేది మహిళలు ఎంచుకుంటున్న అంశంకాదు. జీవ క్రమంలో భాగం గా అది సంభవిస్తుంటుంది. అది మహిళ పాపం కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లను ఆరోగ్యకరమైన నిర్బంధ స్థలాలుగా మార్చడానికి పోలీసు ఉన్నతాధికారులు నడుం కట్టాల్సిన అవస రం ఉందని ఉద్యమ మహిళలు, కస్టడీ పాలవుతున్న నిరసనకారులు భావిస్తున్నారు. మన పోలీసు, పాలనా యంత్రాంగం ఈ విషయమై సత్వరం తగు చర్య చేపట్టవలసి ఉంది.
- ప్రత్యూష బంజారాహిల్స్, హైదరాబాద్