పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఎదురుగా శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
పెద్దాపురం: స్థానిక లూథరన్ హైస్కూల్ ఎదురుగా శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే పైలా లక్ష్మి, భర్త శ్రీనివాసరావు, ఆమె చెల్లెలు పైలా శిల్పలు ఓప్రైవేటు పాఠశాలో పనిచేస్తున్నారు.
శనివారం ఉదయం పాఠశాలకు వెల్లేందుకు ముగ్గురు ఒకే బైక్‌పై బయలుదేరారు. పెద్దాపురం లూథరన్ హైస్కూలు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పైలా లక్ష్మి(25), పైలా శిల్ప(18) అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్సకోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.