కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో అవినీతి, అక్రమాలకు ఏ పథకమూ మినహాయింపు కాదన్న రీతిలో పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పథకాలకు అయితే అక్రమార్కుల బెడద మరి కాస్త అధికంగా ఉంది. నిధుల వినియోగం, పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న దృష్ట్యా న్యూస్‌లైన్ అందిస్తున్న కథనం..
రూ. 80 లక్షల పింఛన్లు దిగమింగినా చర్యలు శూన్యం..
పింఛన్ల పంపిణీలో పినో కంపెనీ ద్వారా నియమితులైన కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లు(సీఎస్పీలు) చేతివాటం చూపుతున్నారు. చనిపోయిన వారు, గ్రామాలు వీడి వెళ్లినవారి పేరుతో పోర్జరీ సంతకాలు చేయడంతోపాటు ఇతర మార్గాల్లో స్వాహా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రూ.80 లక్షలు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీలో వెల్లడైనా రికవరీ మాత్రం లేదు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి తిన్నదాన్ని కక్కించేందుకు ఆదేశాలున్నా వారికి రాజకీయ పెద్దల అండదండలున్న కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. ఇదే క్రమంలో జిల్లాలో ఉన్న 1.16 లక్షల బోగస్ పింఛన్ల తొలగింపులో కూడా తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
ఉపాధిలో రూ. కోట్లు దుర్వినియోగం
Published Mon, Dec 23 2013 4:37 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement