నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్: ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కండక్టర్ రూ.10 లక్షల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. విషయం వెలుగులోకి రావడం తో పత్తా లేకుండా పోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ యాజమాన్యం పేద ప్రయాణికుల కోసం వనిత కార్డులను ప్రవేశ పె ట్టిం ది. ఈ కార్డు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ బస్సు చార్జిలో 10 శాతం రాయితీ లభిస్తుంది. ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఆర్టీసీ అధికారులు రూ. 100 విలువ గల వని త కార్డులను అమ్మాలని కండక్టర్‌లకు పురమాయించారు. నిజామాబాద్ రెండో డిపోలో ప నిచేసే కండక్టర్ రాజేందర్ అలియాస్ రాజు 10 వేల కార్డులు తీసుకుని ప్రయాణికులకు అ మ్మాడు.
ఇందుకుగాను వసూలైన రూ. 10 ల క్షలు తిరిగి కార్పొరేషన్‌కు చెల్లించలేదు. ఈ వి షయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించా రు. డిపో మేనేజర్, డిపో సీఐలు విచారణ ని మిత్తం కండక్టర్ స్వగ్రామమైన బాల్కొండ మండలం ముప్కాల్ వెళ్లారు. అయినా అతని వివరాలు తెలియలేదు. వివరాల కోసం ఆర్టీసీ ఆర్‌ఎంకు ‘న్యూస్‌లైన్ ’ఫోన్ చేయగా.. డిపో మే నేజర్‌ను అడగండి అంటూ ఫోన్ కట్ చేశా డు. ఇక డిపోమేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
రూ.10లక్షలు నొక్కేసిన కండక్టర్
Published Fri, Nov 22 2013 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement