అనంతపురం: జిల్లాలో 8వ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.