రాజధాని గ్రామాల్లో త్వరలో సిటీ బస్సులు నడుపుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు.
గుంటూరు : రాజధాని గ్రామాల్లో త్వరలో సిటీ బస్సులు నడుపుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. వచ్చే నెలలో సుమారు 200 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆయన ఆదివారమిక్కడ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.