హైదరాబాద్ : రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ కార్మిక సంఘాలు శుక్రవారం భేటీ అయ్యాయి. సమ్మె నోటీసు డిమాండ్లపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నందున ఈ నెల 27 నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ గుర్తింపు యూనియన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సవరించడంతోపాటు మధ్యంతర భృతి కూడా చెల్లించాలని చాలాకాలంగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలుమార్లు యాజమాన్యంతో చర్చలు కూడా కొనసాగాయి. కానీ ఇప్పటివరకూ దీనిపై స్పష్టత రాలేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ఇప్పట్లో వేతన సవరణ సాధ్యం కాదని, లాభాల బాట పట్టాక పరిశీలిస్తామంటూ ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని యూనియన్లు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు దిగుతున్నట్టు గుర్తింపు సంఘాల నేతలు పేర్కొన్నారు.
బొత్సతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలు
Published Fri, Jan 24 2014 11:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement