‘సాక్షి’కి ప్రశంసల జల్లు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆవిష్కరణ
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక కథనాలతో 2013 అక్టోబర్ 6న ‘శరణం నీ దివ్య చరణం’ శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్‌డే’ సంచికను ఆదివారం చిన్నశేష వాహనసేవలో ఆవిష్కరించారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో అశోక్‌కుమార్, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ శ్రీహరి ‘సాక్షి ఫన్‌డే’ సంచికను ఆవిష్కరించారు.
2011 సెప్టెంబర్ 25న ‘నమో..వేంకటేశా!’ శీర్షికతో మొదటి సంచిక, 2012 సెప్టెంబర్ 16న ‘బ్రహ్మాండ నాయకుడు’ శీర్షికతో రెండో సంచిక, తాజాగా ఆదివారం మూడో సంచిక తీసుకొచ్చి తిరుమల చారిత్రక అంశాలను పాఠకులకు తెలియజేయడంలో ‘సాక్షి’ సిబ్బంది, యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవోలు కొనియాడారు.