‘సూర్య’కాంతిలో ముడుపుల వేట | sakshi special story on ap zenco solar vidhyuth project | Sakshi
Sakshi News home page

‘సూర్య’కాంతిలో ముడుపుల వేట

Published Sat, Mar 5 2016 2:48 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

‘సూర్య’కాంతిలో ముడుపుల వేట - Sakshi

‘సూర్య’కాంతిలో ముడుపుల వేట

నిజమని తేలిన సోలార్ స్కాం.. ముందే చెప్పిన సాక్షి
అనంతపురం జిల్లా ఎన్‌పి కుంట ప్రాంతం. ఇక్కడ ఎన్టీపీసీ 750
మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఇపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్,
కన్‌స్ట్రక్షన్) కాంట్రాక్టుకు టెండర్లు పిలిచింది. తాజాగా జరిగిన రివర్స్ ఆక్షన్
తర్వాత మెగావాట్ రూ. 4.91 కోట్లుగా నిర్థారించారు.

 అదే జిల్లా... తలారి చెర్వు ప్రాంతం. ఎన్‌పి కుంటకు 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఏపీ జెన్‌కో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల
ఇపీసీ కాంట్రాక్టుల టెండర్లును పిలిచింది. రివర్స్ ఆక్షన్ తర్వాత మెగావాట్ రూ. 6.26 కోట్లుగా తేల్చారు.

ఎన్టీపీసీ టెండరు...  మెగావాట్ రూ.కోట్లలో...4.91
ఏపీ జెన్‌కో నిర్ధారించింది మెగావాట్ రూ.కోట్లలో...6.26

 సాక్షి, హైదరాబాద్  : అదే పని. అదే జిల్లా... కానీ ఎంత తేడా?  ఏపీజెన్‌కో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల్లో గోల్‌మాల్ జరుగుతోందని, దాదాపు రూ. 755 కోట్ల మేర ప్రైవేటు సంస్థలు కైంకర్యం చేయబోతున్నాయని నెలన్నర క్రితమే సాక్షి చెప్పింది. ఇపుడు అదే నిజమయ్యింది. ఎన్టీపీసీ ఒక్కో ప్యాకేజీ 125 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. జెన్‌కో మాత్రం 100 మెగావాట్ల సామర్థ్యంతో 5 ప్యాకేజీలకు ఇపీసీ కాంట్రాక్టు టెండర్లు పిలిచింది. ఎన్టీపీసీ కాంట్రాక్టు వ్యయం కన్నా ఏపీ జెన్‌కో కాంటాక్టు వ్యయం మెగావాట్‌కు రూ. 1.35 కోట్లు అధికం.అంటే 500 మెగావాట్లకు రూ. 675 కోట్లు ప్రైవేటు సంస్థల జేబుల్లోకి వెళ్లేలా ఏపీ జెన్‌కో పక్కా స్కెచ్ వేసింది. లోతుగా విశ్లేషిస్తే ఎన్టీపీసీ రివర్స్ ఆక్షన్ చేపట్టేనాటికి డాలర్ మారకం విలువలోనూ తేడా ఉంది. జెన్‌కో భూమితో పోలిస్తే, ఎన్టీపీసీకి ఇచ్చిన భూమిని చదును చేసేందుకు అదనపు ఖర్చు అవుతుంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే... ఏకంగా ఏపీ జెన్‌కో సోలార్ కాంట్రాక్టు వ్యవహారంలో రూ. 755 కోట్లు అధికంగా ఉంటుందనేది సుస్పష్టం.

సోలార్ ఇపీసీ పనుల్లో పాల్గొనాలంటే, 25 మెగావాట్ల సోలార్ ప్లాంట్ చేసి ఉండాలనేది ఎన్టీపీసీ నిబంధన. దీన్ని జెన్‌కో 50 మెగావాట్లకు పెంచింది. వార్షిక టర్నోవర్ రూ. 300 కోట్లు ఉండాలని ఎన్టీపీసీ పేర్కొంటే, జెన్‌కో రూ.800 కోట్లు ఉండాలంది. ఈ అర్హతలు బీహెచ్‌ఈఎల్, స్టెర్లింగ్, టాటా, ఎల్ అండ్ టీతో పాటు మెగా సంస్థకు ఉండటంతో, అవే ఎల్-1గా నిలిచాయి. ్హఅన్ని సంస్థలు పోటీ పడేలా ఎన్టీపీసీ నిబంధనలు పెట్టడం వల్ల 750 మెగావాట్ల సోలార్ ఇపీసీ టెండర్ల కోసం 17 సంస్థలు పోటీ పడ్డాయి. వాటిల్లో పుంజ్ లాయడ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ముంబై), టెక్నో ఎలక్రిక్, విక్రమ్ సోలార్ (కలకత్తా), ఇన్‌డ్యూర్, ఎల్ అండ్ టి (చెన్నై), మహీంద్ర (ముంబయి), బీహెచ్‌ఇఎల్, టాటా, స్టెర్లింగ్ అండ్ విల్సన్, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, వెల్‌స్పన్, మెగా ఇంజనీరింగ్, ఐసోలక్స్ స్పెయిన్, ఉజాస్ ఎంపి, ఐసెక్, ఐసోలక్స్ ఇన్‌జెనీరియా (ఇండియా) మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇందులో 14 అర్హత పొందాయి. రివర్స్ బిడ్డింగ్‌లో మెగావాట్ రూ. 4.91 కోట్లుగా నిర్థారించారు.  ఆరు కంపెనీలకు టెండర్లను ఖరారు చేయాల్సి ఉంది.

ఏపీ జెన్‌కో మాత్రం రివర్స్ బిడ్డింగ్ వ్యవహారంలో బీహెచ్‌ఇఎల్‌ను ముందు పెట్టారు. ఈ సంస్థ మెగావాట్‌కు రూ. 6.33 కోట్లు కోట్ చేసింది. మిగతా నాలుగు కంపెనీలు అంతక న్నా ఎక్కువగా (సుమారు రూ. 7 కోట్ల వరకూ) కోట్ చేశాయి. రివర్స్ బిడ్డింగ్‌లో బీహెచ్‌ఇల్ మెగావాట్‌కు 6.26 కోట్లకు దిగిరావడం, అదే ధరకు మిగిలిన సంస్థలకూ కట్టబెట్టారు. ఈ కథ వెనుక బీహెచ్‌ఇఎల్ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శలు ఉన్నాయి.

నిజానికి ఎన్టీపీసీ రివర్స్ ఆక్షన్ చేసిన నాటికి (24.2.16) డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ 5 శాతం క్షీణించింది. దీనివల్ల ఇక్కడ సోలార్ ప్యానల్స్ దిగుమతి ఖర్చు పెరిగే వీలుంది. అదీగాక ఎన్టీపీసీకి కేటాయించిన భూములను చదును చేయాల్సి ఉండటం వల్ల ఎక్కువ వ్యయం చేయాల్సి ఉంటుంది. ఏపీ జెన్‌కోకు ఇచ్చిన భూముల్లో ఇలాంటి పనుల కోసం పెద్దగా వెచ్చించాల్సిన అవసరమే లేదు.

 ‘సాక్షి’ కథనంతో కథ రివర్స్
సోలార్ టెండర్ల కుంభకోణాన్ని ఁసాక్షి* ముందే వెల్లడించింది. ఁఏపీ సోలార్.. రూ. 755 కోట్లు గోల్‌మాల్* అనే శీర్షికతో జనవరి 25న కథనాన్ని ప్రచురించింది. ఇతర రాష్ట్రాల్లో సోలార్ ప్లాంట్ల నిర్మాణం మెగావాట్‌కు 4.75 కోట్లు మాత్రమే ఉందని చెప్పింది. ఏపీలో మెగావాట్‌కు రూ. 6.26 కోట్లకు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయని వెల్లడించింది. ఈ కథనంతో ఏపీ జెన్‌కో డెరైక్టర్లు రివర్స్ అయ్యి.. ఈ కుంభకోణంలో పాపం పంచుకోలేమన్నారు. దీంతో జెన్‌కో  వెనక్కి తగ్గింది. ఎన్టీపీసీ ఇపీసీ పనుల్లో మెగావాట్‌కు రూ. 4.91 కోట్లకే ఖరారు కావడంతో జెన్‌కో అధికారులు కంగుతిన్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు వారు ఇష్టపడటంలేదు. ఏపీ పవర్ సోలార్ కార్పొరేషన్ ఎండీ ఆదిశేషును వివరణ కోరగా... ఎన్టీపీసీ రివర్స్ ఆక్షన్ వివరాలు తమకు అందనే లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement