20 మందిని కాపాడి.. ప్రాణాలు విడిచాడు | school bus Rush into the Stream update | Sakshi
Sakshi News home page

20 మందిని కాపాడి.. ప్రాణాలు విడిచాడు

Published Mon, Nov 30 2015 2:04 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

school bus Rush into the Stream update

ఒంగోలు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన స్కూల్ బస్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

వివరాలు... ఒంగోలు క్రౌపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం 20 మంది విద్యార్థులతో త్రోవగుంట నుంచి వస్తోంది. త్రోవగుంట వద్ద జాతీయరహదారిపై అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆపై రోడ్డుపక్కన భారీ నీటి గుంటలోకి ఒరిగిపోయింది.

ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పెను ప్రమాదం తప్పటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారని.. అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement