సీమాంధ్ర నేతలు యూటర్న్ తీసుకోవడం సరికాదు | Seemandhra leaders not to take u turn,says Mlc ponguleti sudhakar reddy | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర నేతలు యూటర్న్ తీసుకోవడం సరికాదు

Published Sat, Aug 24 2013 2:01 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Seemandhra leaders not to take u turn,says Mlc ponguleti sudhakar reddy

సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై యూటర్న్‌ తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అంగీకరించిన నేతలు... తదానంతర పరిణామల నేపథ్యంలో తమ విధానాలు మార్చుకోవడంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సీమాంధ్ర నేతలకు హితవు పలికారు. ఆ ప్రాంతాల నేతలు వైఖరి వల్ల తెలుగు ప్రజల మధ్య నెలకొన్న సామరస్యం దెబ్బతింటోందని సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించకుంటే విపరీత పరిస్థితులు తలెత్తుతాయని సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement