సాక్షి, తాడేపల్లి: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. సీనియర్ అధికారులు కృష్ణబాబు, వరప్రసాద్, సంధ్యారాణి, లక్ష్మీకాంతం, సత్యనారాయణ, సంజయ్, జవహర్ రెడ్డి, అరుణ్ కుమార్, శశిభూషణ్, ప్రవీణ్ కుమార్, ఉదయలక్ష్మి, ఇక కలెక్టర్లు ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, సత్యనారాయణ, ముత్యాలరావు, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీలు రవిప్రకాశ్, మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు. కాగా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం తాడేపల్లి చేరుకున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఉన్నతాధికారులు
Comments
Please login to add a commentAdd a comment