రాజ్యసభకు సీతమ్మ | sitamma to rajya sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు సీతమ్మ

Published Sat, Feb 8 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

sitamma to rajya sabha

 ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గతంలో ఆమె భీమవరం ముని సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుని మిగి లిన మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించారు. 2009లో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సీతారామలక్ష్మి ఓటమి పాలయ్యూరు. 2010 నుంచి ఇప్పటివరకూ జిల్లా టీడీపీ సారధ్య బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు.
 
 9న జిల్లాకు రాక : రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన తోట సీతారామలక్ష్మి ఈ నెల 9న జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌లో విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.15 గంటలకు హనుమాన్ జంక్షన్‌లో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం పలుకుతామని ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వట్లూరు మీదుగా ఏలూరుకు చేరుకుని ఫైర్‌స్టే షన్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. 10.15 గంటలకు జిల్లా టీడీపీ కార్యాల యంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఏలూరు, గుండుగొలను, నారాయణపురం, గణపవరం, ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారు.
 
  రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సీతారామలక్ష్మిని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పార్టీ జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ), మాజీ మంత్రులు కారుపాటి వివేకానంద, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మండల లక్ష్మణరావు, ఎం.కృష్ణం రాజు అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement